పోకిరి సినిమాలో మహేష్ చెప్పిన డైలాగ్ గుర్తుండే వుంటుంది కదా.. ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నయ్య.. బుల్లెట్ దిగిందా లేదా అని మహేష్ చెబుతాడు. ఇప్పుడు సర్కారు వారి పాట విషయంలో కూడా అదే జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ స్క్రీన్ పై కనిపించి దాదాపు రెండున్నర ఏళ్లు అయిపోయింది. సర్కారు వారి పాటను కూడా ఎప్పుడో మొదలుపెట్టిన కూడా మధ్యలో కరోనా వల్ల కూడా ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఫైనల్ గా ఎన్నో అడ్డంకుల తరువాత నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమాలో మహేష్ నటన, ఫైట్లు, యూత్‌కు కనెక్ట్ అయ్యే డైలాగ్స్.. అన్నింటికీ మించి మహేష్ స్టైలిష్ గా కనిపించడంతో ఫిదా అయ్యారు ఫ్యాన్స్. ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ ను సొంతం చేసుకోవడమే కాదు ఇప్పుడు కొత్తగా రికార్డులు క్రియేట్ చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఓవర్సీస్ లో అప్పుడే రికార్డులు క్రియేట్ చేయడం మొదలుపెట్టింది. మహేష్ కు ఓవర్సీస్ లో మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈసినిమా ప్రీమియర్ల ద్వారా 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది. దీంతో ఈసినిమా నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులు బద్దలు కొట్టింది.
Super🌟 @urstrulyMahesh is on a Record Breaking Spree🔥#SarkaruVaariPaata is now the
HIGHEST PREMIERES GROSSER
(Non RRR) Post-pandemic for any Indian cinema in USA🇺🇸#BlockbusterSVP 💥💥#SVPMania #SVPUsaSandhadi@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @madhie1 pic.twitter.com/veaaAWDGcv— SarkaruVaariPaata (@SVPTheFilm) May 12, 2022




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: