జూన్ లో రానున్న ‘గుర్తుందా శీతాకాలం’

Gurthundha Seethakalam Movie To Release In June 2022,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Gurthundha Seethakalam,Gurthundha Seethakalam Movie,Gurthundha Seethakalam Telugu Movie,Gurthundha Seethakalam Movie Updates, Gurthundha Seethakalam Movie Releasing in June 2022,Satyadev Gurthundha Seethakalam Movie Releasing in June,Satyadev Gurthundha Seethakalam Movie Updates

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో సత్యదేవ్ కూడా ఒకరు. చిన్న చిన్న పాత్రలు వేసే స్థాయి నుండి ఇప్పుడు హీరోగా వరుస అవకాశాలతో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన తమన్నాతో ఓ సినిమా చేస్తున్నాడు. గుర్తుందా శీతాకాలం టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఫిబ్రవరిలో రిలీజ్ కావాల్సిన సినిమాను మళ్లీ వాయిదా వేశారు. ఇక ఆ తర్వాత సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు చిత్రయూనిట్. అయితే ఇప్పటికే ఈసినిమా నుండి పాటలు అలానే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అవి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈసినిమా రిలీజ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈసినిమాను జూన్ లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. అయితే జూన్ లో రిలీజ్ ఉంటుంది అని చెప్పారు కానీ.. డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు. త్వరలో డేట్ ను కూడా ఫిక్స్ చేసి అప్ డేట్ ఇస్తారేమో చూడాలి.

ఇంకా ఈ సినిమాలో మేఘా ఆకాష్, కావ్య‌శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగ శేఖర్ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాను నాగశేఖర్, భావన రవి నిర్మిస్తున్నారు. కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా.. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 6 =