
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 6


వన్ మిలియన్ డాలర్స్ దిశగా "సీతారామం"

స్నేహితురాళ్ళు అయిన సీనియర్ హీరోయిన్స్ తో మీనా

సౌత్ ఇండస్ట్రీస్ లో బిజీ హీరోయిన్ మేఘా ఆకాష్

మూడు నెలల లో సమంత మూడు పాన్ ఇండియా మూవీస్ రిలీజ్

'పవన్' స్టార్ట్.. కెమెరా.. యాక్షన్..!

'స్వాతిముత్యం' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..!

"లైగర్" మూవీ మల్టీ సిటీ ప్రమోషనల్ టూర్

"మాచర్ల నియోజకవర్గం " మూవీ మేకింగ్ వీడియో రిలీజ్

'చంద్రముఖి 2' ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

రిలీజ్ డేట్ ను మార్చుకున్న 'కోబ్రా'

2022 కామన్ వెల్త్ గేమ్స్ విన్నర్స్ కు ప్రభాస్ అభినందనలు
ఇంగ్లాండ్ దేశంలో బర్మింగ్ హామ్ లో 2022 కామన్ వెల్త్ గేమ్స్ జులై 28 నుండి ఆగస్ట్ 8వ తేదీ వరకూ జరిగిన విషయం తెలిసిందే. 5054 మంది క్రీడాకారులు పాల్గొన్న 2022 కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ క్రీడాకారులు 22 స్వర్ణం ,16 రజతం , 23 కాస్యం మెడల్స్ సాధించారు. 61 పతకాలతో భారత్ నాలుగో స్థానం లో నిలిచింది.

ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో "థ్యాంక్యూ "మూవీ స్ట్రీమింగ్
యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరిస్తూ వరుస సక్సెస్ ఫుల్ చిత్రాలతో నాగచైతన్య టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కిన “థ్యాంక్యూ” మూవీ జూలై 22 వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. రాశీ ఖన్నా , అవికాగోర్ , మాళవిక నాయర్ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందించారు. నాగ చైతన్య మూడు వేరియేషన్స్ ఉన్న రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఈవారం రిలీజ్.. ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..?
గత వారం రిలీజ్ అయిన రెండు సినిమాలు టాలీవుడ్ కు మళ్లీ కొత్త ఊపునిచ్చాయి. ప్రేమకథగా వచ్చిన సీతారామం ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను తాకి క్లాసిక్ హిట్ కొట్టగా.. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వచ్చిన బింబిసార కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని దూసుకుపోతున్నాయి. ఇక గత వారం ఎఫెక్ట్ తో ఈవారం రిలీజ్ లపై కూడా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ వారం కూడా కొన్ని సినిమాలు రిలీజ్ కు సిద్దమయ్యాయి. అందులో లాల్ సింగ్ చద్దా, మాచర్ల నియోజక వర్గం, కార్తికేయ2 సినిమాలు.

వన్ మిలియన్ డాలర్స్ దిశగా "సీతారామం"
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న “సీతారామం”ప్రేక్షకులతో పాటు…

అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన"సీతారామం " దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న “సీతారామం”ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజులలో 33 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్…

స్నేహితురాళ్ళు అయిన సీనియర్ హీరోయిన్స్ తో మీనా
"నెంజంగళ్ "(1982 ) మూవీ తో కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన మీనా తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించారు. "నవయుగం "(1990 ) మూవీ తో మీనా టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. సూపర్ హిట్"సీతారామయ్య గారి మనవరాలు " మూవీ లో మీనా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో మీనా తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. అన్నిభాషల స్టార్ హీరోస్ కు జోడీగా నటించిన ఘనత మీనాదే.

"లాల్ సింగ్ చెడ్డా" లో తెలుగుతనం ఉట్టి పడుతుంది..!
అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా లాల్ సింగ్ చెడ్డా. ఈసినిమాలో నాగచైతన్య కూడా బాలరాజు అనే ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. హాలీవుడ్ లో సూపర్ హిట్ అయినటువంటి ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కొరకు ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండడం విశేషం .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగష్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు…

సౌత్ ఇండస్ట్రీస్ లో బిజీ హీరోయిన్ మేఘా ఆకాష్
హీరో నితిన్ కథానాయకుడిగా తెరకెక్కిన "లై " మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన మేఘా ఆకాష్ "రాజ రాజ చోర "మూవీ తో విజయం సాధించారు. తలైవా రజనీకాంత్ సూపర్ హిట్ "పెట్ట "మూవీ తో మేఘ కోలీవుడ్ లో అడుగుపెట్టారు. "శాటిలైట్ శంకర్" మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయిన మేఘ , సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కమర్షియల్ హిట్ "రాధే" మూవీ లో నటించారు. పలు తెలుగు , తమిళ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న మేఘ తెలుగు , తమిళ భాషల పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా మారారు.

'జిన్నా' సన్నీ లియోన్ లుక్ రిలీజ్..!
ఈషాన్ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమాలో మంచు విష్ణు గాలి నాగేశ్వర్రావు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉన్న ఈసినిమా నుండి ప్రమోషన్స్ ను చిన్నగా స్టార్ట్ చేశారు. రీసెంట్ గానే మంచు విష్ణు లుక్ ను రిలీజ్ చేయగా.. రెండు రోజుల క్రితమే పాయల్ రాజ్ పుత్ లుక్ ను రిలీజ్ చేశారు. మేకర్స్. పచ్చళ్ళ స్వాతిగా ఈసినిమాలో పాయల్ రాజ్ పుత్ నటిస్తుంది. ఇకఇప్పుడు మరో కీలక పాత్రలో నటిస్తున్న సన్నీ లియోన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో సన్నీ లియోన్ రేణుక అనే పాత్రలో…

మూడు నెలల లో సమంత మూడు పాన్ ఇండియా మూవీస్ రిలీజ్
స్టార్ హీరోయిన్ సమంత మూడు నెలలలో మూడు పాన్ ఇండియా మూవీస్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన “యశోద” మూవీ అక్టోబర్ 3వ వారంలో రిలీజ్ కానుందని సమాచారం. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. పాన్ ఇండియా మూవీ గా సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న “యశోద ” మూవీలో కీలక యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్…

'సీతారామం' కు లైన్ క్లియర్.. 'UAE' సెన్సార్ కంప్లీట్..!
హనురాఘవపూడి దర్శకత్వంలో మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన సినిమా సీతారామం. మహానటి సినిమా తరువాత దుల్కర్ నుండి వచ్చిన రెండో స్ట్రైయిట్ సినిమా ఇది. ఇక ఈసినిమా ఆగస్ట్ 5న ఈ సినిమా థియేటర్స్ విడుదల అయ్యి మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. 1960 కాలం నాటి వార్ బ్యాక్ డ్రాప్ ప్రేమకథగా వచ్చిన ఈసినిమాకు అందరూ ఫిదా అవుతున్నారు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. ఇక్కడ మాత్రమే కాదు ఈసినిమా ఓవర్సీస్ లో కూడా మంచి టాక్ తో పాటు కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది. 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ కు అతి చేరువలో ఉంది.

'పవన్' స్టార్ట్.. కెమెరా.. యాక్షన్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొఘలాయిల కాలం నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఫ్యాన్స్ కూడా ఈసినిమా కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. పవన్ మొదటిసారి ఇలాంటి పాత్రలో నటిస్తుండటంతో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈసినిమా మాత్రం లేట్ అవుతూ వస్తూనే ఉంది. వకీల్ సాబ్ కన్నా ముందు ఈసినిమాను మొదలుపెట్టినా కూాడా ఈసినిమా ఇంతవరకూ షూటింగ్ నే పూర్తి చేసుకోలేదు. ఇక ఈమధ్య మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టినా పవన్ మళ్లీ రాజకీయాలతో బిజీ అవ్వడంతో షూట్ కు బ్రేక్ పడింది.

'స్వాతిముత్యం' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..!
ఒకప్పుడు టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో బెల్లంకొండ సురేష్ కూడా ఒకరు. ఇప్పుడు కాస్త స్లో అయ్యారు కానీ అప్పట్లో ఈయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ఇక ఈయన వారసత్వంతో ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగు తెరకు పరిచయమై సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పుడు ఆయన చిన్న కొడుకు.. సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈయన ఎంట్రీకి ఎప్పుడో రంగం సిద్దమైంది. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ కరోనా వల్ల ఈసినిమా చాలా లేట్ అయింది. ఫైనల్ గా మరికొద్ది రోజుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

"లైగర్" మూవీ మల్టీ సిటీ ప్రమోషనల్ టూర్
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.”లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ పాన్ ఇండియా…

"కార్తికేయ–2" మూవీ తనకు ఎంతో ప్రత్యేకం - అనుపమ పరమేశ్వరన్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన“కార్తికేయ 2 “ మూవీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ , క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ…

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' రిలీజ్ డేట్ ఫిక్స్..!
చిన్న క్యారెక్టర్ల ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో ఫైనెస్ట్ హీరోగా పేరుతెచ్చుకున్న నటుడు సుధీర్ బాబు. మొదట కాస్త ఒకే ధోరణి సినిమాలు చేసినా సమ్మోహనం నుండి తన రూటును మార్చాడు. ఆ తరువాత వి, ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి వినూత్న కథలను ఎంచుకుంటున్నాడు. ఇక ఇప్పుడు మరో ప్రేమకథతో రాబోతున్నాడు సుధీర్. సెన్సిటివ్ డైరెక్టర్ మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే లవ్ ఎంటర్టైనర్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇక ఈసినిమా స్టార్ట్ అవ్వడానికి ఎప్పుడో స్టార్ట్ అయింది కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన…

"మాచర్ల నియోజకవర్గం " మూవీ మేకింగ్ వీడియో రిలీజ్
రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్ ,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతి శెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ ఆగస్ట్ 12వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో క్యాథరీన్ మరో కథానాయిక. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్రఖని నటించారు. మహతి సాగర్ సంగీతం అందించారు . చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం” మూవీ పోస్టర్‌లు, గ్లింప్స్ సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

'చంద్రముఖి 2' ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్
పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజనీ స్టైల్‌కు, జ్యోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు చంద్రముఖి సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఈసినిమాను మాతృకకు దర్శకత్వం వహించిన పి.వాసునే దర్శకత్వం వహించనున్నాడు. రజనీ ప్లేస్ లో లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

ఫ్యాన్స్ , వెల్ విషెర్స్ కు థ్యాంక్స్ - మహేష్ బాబు
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. హ్యాండ్సమ్ హీరో మహేష్ బాబు మంగళవారం (ఆగస్ట్ 9) తన 47వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ పోతినేని, రకుల్ ప్రీత్ సింగ్,కీర్తి సురేశ్ వంటి స్టార్స్ తో పాటు అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి.

రిలీజ్ డేట్ ను మార్చుకున్న 'కోబ్రా'
ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా కోబ్రా. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ గణితశాస్త్ర మేధావి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఈసినిమాను ముందు నుండి ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలుపుతూ వచ్చారు మేకర్స్. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ను మార్చారు. కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.