స్నేహితురాళ్ళు అయిన సీనియర్ హీరోయిన్స్ తో మీనా

Meena Shares A Picture with Senior Heroines,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest News,Tollywood Movie Updates,Tollywood Movie Releases This Week,Telugu Movie Releases This Weekend,Meena,Actress Meena,Meena Latest Movie Updates,Meena Upcoming Movies,Meena Shared a picture with Senior Actress,Senior Actress Meena Shared a Picture with Senior Heroines,Rambha,Sanghavi,Sangeetha,Meena Shared with her Friends Senior Heroines in Social Media.Actress Meena Shareda Picture with Senior Heroines in Social Media,Meena Shares a Pictures of Senior Heriones Goes Viral in Social Media

“నెంజంగళ్ “(1982 ) మూవీ తో కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన మీనా తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించారు. “నవయుగం “(1990 ) మూవీ తో మీనా టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. సూపర్ హిట్”సీతారామయ్య గారి మనవరాలు ” మూవీ లో మీనా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో మీనా తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. అన్నిభాషల స్టార్ హీరోస్ కు జోడీగా నటించిన ఘనత మీనాదే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సీనియర్‌ హీరోయిన్‌ మీనా భర్త ఇటీవలే అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి మీనా తీవ్ర విషాదంలో ఉన్నారు. తాజాగా మీనాను పరామర్శించేందుకు సీనియర్‌ హీరోయిన్స్‌ రంభ, సంగీత, సంఘవి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లారు. మీనాని పలకరించి తనతో కలిసి ఫోటోలు దిగారు.మీనా కూడా అలనాటి తారలు, తన స్నేహితురాళ్ళతో కలిసి ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన భర్త చనిపోయాక మొదటిసారి మీనా ఫేస్ లో చిరునవ్వు కనిపించింది. రంభ, సంగీత, సంఘవి, మీనా కలిసి ఫోటో దిగడం, భర్త చనిపోయాక మొదటిసారి ఇలా నవ్వుతూ కనపడటంతో ఆ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =