‘సీతారామం’ కు లైన్ క్లియర్.. ‘UAE’ సెన్సార్ కంప్లీట్..!

sitaramam movie cleared uae censor formalities

హనురాఘవపూడి దర్శకత్వంలో మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన సినిమా సీతారామం. మహానటి సినిమా తరువాత దుల్కర్ నుండి వచ్చిన రెండో స్ట్రైయిట్ సినిమా ఇది. ఇక ఈసినిమా ఆగస్ట్ 5న ఈ సినిమా థియేటర్స్ విడుదల అయ్యి మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. 1960 కాలం నాటి వార్ బ్యాక్ డ్రాప్ ప్రేమకథగా వచ్చిన ఈసినిమాకు అందరూ ఫిదా అవుతున్నారు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. ఇక్కడ మాత్రమే కాదు ఈసినిమా ఓవర్సీస్ లో కూడా మంచి టాక్ తో పాటు కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది. 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ కు అతి చేరువలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇక్కడ వరకూ బాగానే ఉన్నా గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా రిలీజ్‌కు సెన్సార్ నో చెప్పిన సంగతి తెలిసిందే. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్, ఒమన్లలో విడుదల చేయకుండా నిషేధించాయి. ఈ చిత్రంలో మతపరమైన సన్నివేశాలు ఉన్నాయని, అందువల్లే ఈ సినిమాను గల్ఫ్‌లో రిలీజ్ చేయొద్దంటూ సెన్సార్ బోర్డ్‌ ఆదేశించారు. దీంతో దుల్కర్ అభిమానులు కాస్త నిరాశ చెందారు. అయితే తాజా సమాచారం ప్రకారం యూఏఈలో ఈసినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే అక్కడ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్.

కాగా ఈసినిమాను వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమాస్ ప‌తాకంపై అశ్విని దత్‌, ప్రియాంక్‌ దత్‌ నిర్మించారు. ఈసినిమాలో ఇంకా ప్రకాష్ రాజ్, సుమంత్, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, సునీల్, ప్రియదర్శి పలువురు కీలక పాత్రల్లో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈసినిమాకు పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫి అందించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.