ఇంగ్లాండ్ దేశంలో బర్మింగ్ హామ్ లో 2022 కామన్ వెల్త్ గేమ్స్ జులై 28 నుండి ఆగస్ట్ 8వ తేదీ వరకూ జరిగిన విషయం తెలిసిందే. 5054 మంది క్రీడాకారులు పాల్గొన్న 2022 కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ క్రీడాకారులు 22 స్వర్ణం ,16 రజతం , 23 కాస్యం మెడల్స్ సాధించారు. 61 పతకాలతో భారత్ నాలుగో స్థానం లో నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 “మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “, వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో టైమ్ ట్రావెల్ నేపథ్యం లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ తో “ప్రాజెక్ట్ K ”మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల షూటింగ్స్ తో బిజీ గా ఉన్న స్పోర్ట్స్ లవర్ ప్రభాస్2022 కామన్ వెల్త్ గేమ్స్ విన్నర్స్ కు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. భారత దేశ ప్రజలు గర్వించేలా , దేశానికి కీర్తి ప్రతిష్ఠలు పెంపొందించిన ఛాంపియన్స్ అందరికీ అభినందలు అంటూ ప్రభాస్ సోషల్ మీడియా లో స్పందించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: