అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన”సీతారామం ” దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్

Sita Ramam Stars Dulquer Salmaan & Mrunal Thakur Thank Audience,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest News,Tollywood Movie Updates,Tollywood Movie Releases This Week,Telugu Movie Releases This Weekend,Sita Ramam,Sita Ramam Movie,Sita Ramam Telugu Movie,Sita Ramam Movie Latest Updates,Sita Ramam Latest News,Sita Ramam Hero Dulquer Salmaan,Hero Dulquer Salmaan,Dulquer Salmaan Thanks Audience For Making Movie Success, Dulquer Salmaan and Murnal Thakur Thank Audience For Making Movie Success,Dulquer Salmaan Upcoming Movies,Dulquer Salmaan Latest Blocbuster Movie Sita Ramam

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న “సీతారామం”ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజులలో 33 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సీతారామం ” మూవీ ప్రేక్షకుల ప్రశంసల తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. “సీతారామం ” మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రామం , సీత అభిమానులకు సోషల్ మీడియా ద్వారా థ్యాంక్స్ చెప్పారు. మా పై చూపిస్తున్న ప్రేమ , సపోర్ట్ కు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలని దుల్కర్ , తనను తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసినందుకు , తమ పై చూపిస్తున్న ప్రేమ , అభిమానులకు థ్యాంక్స్ అంటూ మృణాల్ ఠాకూర్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్స్ పెట్టారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =