“కార్తికేయ–2” మూవీ తనకు ఎంతో ప్రత్యేకం – అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran talks about Karthikeya 2 Movie,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest News,Tollywood Movie Updates,Tollywood Movie Releases This Week,Telugu Movie Releases This Weekend,Anupama Parameswaran,Actress AnupamaParameswaran,Anupama Parameswaran About Karthikeya 2 Movie,Anupama Parameswaran with Nikhil Siddharth Movie Karthikeya 2,Karthikeya2 Movie Latest Updates,Anupama Parameswaran New Movie Updates,Anupama Parameswaran Next Movie,Anupama Parameswaran Upcoming Projects,Anupama Parameswaran Movies in Tollywood,Anupama Parameswaran Upcoming Movies in Tollywood

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన“కార్తికేయ 2 “ మూవీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ , క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“కార్తికేయ–2” చిత్రం ట్రైలర్‌ను వైజాగ్ శరత్‌ థియేటర్లో మంగళవారం చిత్రయూనిట్‌ సభ్యులు విడుదల చేశారు. ప్రేక్షకుల ముందు ట్రైలర్‌ విడుదల చేసి, కాసేపు ముచ్చటించారు.అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో హీరో నిఖిల్‌ మాట్లాడుతూ . సుబ్రహ్మణ్య స్వామి కథనంపై రూపొందించిన “కార్తికేయ–1” చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతో ఆదరించారన్నారు. ద్వారకలోని శ్రీ కృష్ణుడి గుడి చుట్టూ జరిగే కథాంశం ఆధారంగా “కార్తికేయ–2 “చిత్రం తెరకెక్కిందనీ , తమ సినిమాను శ్రీకృష్ణుడే ముందుకు నడిపారని, షూటింగ్‌ సమయంలో ఎన్నో అద్భుతాలు జరిగాయనీ , దర్శకుడు చందు మొండేటి చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పారు. హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ మాట్లాడుతూ “కార్తికేయ–2” చిత్రం తనకు ఎంతో ప్రత్యేకమనీ , ప్రేక్షకులు చూసినంత సేపు తర్వాత ఏమి జరుగుతుందో అని ఉద్వేగానికి గురవుతారనీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =