‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Release Date Fixed,Aa Ammayi Gurinchi Meeku Cheppali Release Date Update,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest News,Tollywood Movie Updates,Tollywood Movie Releases This Week,Telugu Movie Releases This Weekend,Aa Ammayi Gurinchi Meeku Cheppali,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie,Aa Ammayi Gurinchi Meeku Cheppali Telugu Movie,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Updates,Aa Ammayi Gurinchi Meeku Cheppali Released Date Confirmed,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Latest News,Aa Ammayi Gurinchi Meeku Cheppali Release Date Announced,Aa Ammayi Gurinchi Meeku Cheppali Officially Announced,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Release Date Fixed,Hero Sudheer Babu,Sudheer Babu Upcoming Movie Aa Ammayi Gurinchi Meeku Cheppali,Sudheer Babu Upcoming Movie Aa Ammayi Gurinchi Meeku Cheppali Release Date Announced

చిన్న క్యారెక్టర్ల ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో ఫైనెస్ట్ హీరోగా పేరుతెచ్చుకున్న నటుడు సుధీర్ బాబు. మొదట కాస్త ఒకే ధోరణి సినిమాలు చేసినా సమ్మోహనం నుండి తన రూటును మార్చాడు. ఆ తరువాత వి, ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ వంటి వినూత్న క‌థ‌ల‌ను ఎంచుకుంటున్నాడు. ఇక ఇప్పుడు మరో ప్రేమకథతో రాబోతున్నాడు సుధీర్. సెన్సిటివ్ డైరెక్టర్ మోహ‌న కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇక ఈసినిమా స్టార్ట్ అవ్వడానికి ఎప్పుడో స్టార్ట్ అయింది కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక చాలా రోజుల తరువాత ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ తో వచ్చేశారు. ఎప్పటినుండి ఎదురుచూస్తున్న ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసి ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను సెప్టెంబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని సుధీర్ బాబు కూడా తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. అనగనగా ఒక అమ్మాయి.. మిగితా కథ, మా ఇద్దరి కథ..ఈ అబ్బాయి సెప్టెంబరు 16న చెబుతాడు అంటూ తెలిపాడు.

ఇక ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, గోపరాజు రమణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక రీసెంట్ గానే మైత్రీ మూవీ మేకర్స్ కూడా భాగమయ్యారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. పిజి విందా కెమెరా మెన్‌గా పనిచేస్తున్నారు.

మరి ఇంద్రగంటి, సుధీర్ బాబు కాంబినేషన్ లో ఇప్పటికే సమ్మోహనం, వి సినిమాలు వచ్చాయి. రెండు సినిమాలు మంచి హిట్ కొట్టాయి. దీంతో ఇప్పుడు ఈసినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. ఈసినిమా ఎలాంటి విజయం దక్కించుకుంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సాందే మరి..

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 4 =