‘స్వాతిముత్యం’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..!

Bellamkonda Ganesh Swathimutyam Movie New Release Date,Swathimuthyam Movie Release Date Postponed, New Release Date Set For Dasara,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest News,Tollywood Movie Updates,Tollywood Movie Releases This Week,Telugu Movie Releases This Weekend,Swathimuthyam Movie, Swathimuthyam Movie, Swathimuthyam Telugu Movie,Swathimuthyam Telugu Movie Release Date Postponed,Swathimuthyam Movie Release Date, Swathimuthyam Movie Release Date Postponed,Swathimuthyam Movie Release Date Postponed to Dasara, Swathimuthyam Movie Release on Dasara,Ganesh Bellamkonda and Varsha Bollamma, Ganesh Bellamkonda,Hero Ganesh Bellamkonda,Ganesh Bellamkonda Upcoming Movie Swathimuthyam,Ganesh Bellamkonda Movie Upates,Ganesh Bellamkonda New Movie

ఒకప్పుడు టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో బెల్లంకొండ సురేష్ కూడా ఒకరు. ఇప్పుడు కాస్త స్లో అయ్యారు కానీ అప్పట్లో ఈయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ఇక ఈయన వారసత్వంతో ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగు తెరకు పరిచయమై సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పుడు ఆయన చిన్న కొడుకు.. సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈయన ఎంట్రీకి ఎప్పుడో రంగం సిద్దమైంది. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ కరోనా వల్ల ఈసినిమా చాలా లేట్ అయింది. ఫైనల్ గా మరికొద్ది రోజుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లక్ష్మణ్ కె కృష్ణ డైరెక్షన్ లో గణేష్ హీరోగా వస్తున్న సినిమా స్వాతిముత్యం. నిజానికి ఈసినిమాను ఆగష్ట్ 13న రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవ్వకపోవండతో వాయిదా వేస్తున్నట్టు రీసెంట్ గా తెలిపారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని కూడా తెలిపారు. ఈనేపథ్యంలో తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్ గా రిలిజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

ఇక ఈసినిమాలో బెల్లంకొండ గణేష్ సరసన వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తుండగా ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈసినిమాకు మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా సూర్య సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 7 =