కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 84

ABCD Movie Release Date Gets Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Allu Sirish ABCD Release Date,ABCD Telugu Movie Release Date Confirmed,ABCD Movie Release Date Fixed
రిలీజ్ అప్‌డేట్

ఏబీసీడీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా “ఎబిసిడి” (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా..ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్బంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ చిత్రం మార్చి ఒక‌టో తేదిన విడుద‌ల చేస్తున్నట్టు తెలిపారు.

TFN Adminవాట్సాప్
Anushka Shetty New Movie Details,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Actress Anushka New Movie Updates,Anushka Next Film Updates,Heroine Anushka New Movie News
సినిమా వార్తలు

అనుష్క కొత్త సినిమా - ఫస్ట్ క్రాస్ ఓవర్ మూవీ

లేడి ఓరియెంటెడ్ సినిమాల కేరాఫ్ అడ్రస్ ఎవరంటే ముందు గుర్తొచ్చేది అనుష్కనే. ఇప్పుడు తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించడానికి రెడీ అవుతోంది. హేమంత్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాకు సంబంధించి తాజాగా ప్రెస్ రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
30 Years For Chiranjeevi Attaku Yamudu Ammayiki Mogudu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Attaku Yamudu Ammayiki Mogudu Movie News,Attaku Yamudu Ammayiki Mogudu Telugu Movie News,Megastar C
స్పెషల్

చిరంజీవి ‘అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు’కి 30 ఏళ్ళు

మెగాస్టార్ చిరంజీవి, ద‌ర్శ‌కుడు ఎ.కోదండ‌రామిరెడ్డి కాంబినేష‌న్‌లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలు వ‌చ్చాయి. వాటిలో ‘అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు’ ఒక‌టి. ఇందులో చిరంజీవికి జోడీగా విజ‌య‌శాంతి న‌టించగా... 'అభినేత్రి’ వాణిశ్రీ భారీ విరామం త‌ర్వాత‌ ఈ చిత్రంలోని అత్త పాత్రతో మ‌ళ్ళీ తెలుగులో రీ-ఎంట్రీ ఇచ్చారు. కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, అన్న‌పూర్ణ‌, రావుగోపాల‌రావు, అల్లు రామ‌లింగ‌య్య‌, గిరిబాబు, బ్ర‌హ్మానందం ముఖ్య‌పాత్ర‌ల‌ను పోషించారు. ఈ ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను గీతా ఆర్ట్స్ ప‌తాకంపై అల్లు అర‌వింద్ నిర్మించారు. చిరు, వాణిశ్రీ పాత్ర‌ల మ‌ధ్య సాగే 'ఛాలెంజ్‌' స‌న్నివేశాలు... అలాగే చిరు, విజ‌య‌శాంతి…

Team TFNవాట్సాప్
Dil Raju Luck Continues For This Sankranthi Too,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Dil Raju Latest News,Dil Raju New Movie Updates,Dil Raju Next Film Updates
సినిమా వార్తలు

`దిల్` రాజుకు మ‌రోసారి అచ్చొచ్చిన సంక్రాంతి

నిర్మాత‌గా `దిల్` రాజుది 15 ఏళ్ళ ప్ర‌యాణం. ఈ జ‌ర్నీలో సింహ‌భాగం విజ‌యవంత‌మైన చిత్రాల‌ను అందించి... మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ అనిపించుకున్నారాయ‌న‌. 2017లో అయితే... డబుల్ హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకుని ఓ సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. ఇదిలా ఉంటే... సంక్రాంతి కానుక‌గా ఆయ‌న అందించిన తాజా చిత్రం `ఎఫ్ 2` బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తోంది. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా... మొద‌టి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా క‌లెక్ష‌న్ల విష‌యంలోనూ దూసుకుపోతోంది.

Team TFNవాట్సాప్
25 Years For Superstar Krishna No 1 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,No 1 Movie Updates,No 1 Telugu Movie Latest News,Superstar Krishna No 1 Movie Latest News,Superstar Krishna No 1 Movie
స్పెషల్

సూప‌ర్‌స్టార్ కృష్ణ‌ ‘నెంబ‌ర్‌వ‌న్‌’కు 25 ఏళ్ళు

జ‌న‌వ‌రి 14... ఈ తేదీతో సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు విడ‌దీయ‌రాని అనుబంధ‌ముంది. ఇదే రోజున కృష్ణ న‌టించిన 15 చిత్రాలు విడుద‌లయ్యాయంటే... ఈ తేదీతో సూప‌ర్‌స్టార్ కున్న ప్ర‌త్యేక అనుబంధం ఏమిటో అర్థంచేసుకోవ‌చ్చు. ఆ చిత్రాల జాబితాలో ‘నెంబ‌ర్‌వ‌న్’ ఒక‌టి. కృష్ణ‌, సౌంద‌ర్య జంట‌గా ఎస్‌.వి.కృష్ణారెడ్డి డైరెక్ష‌న్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో... మ‌హేష్ ఆనంద్ విల‌న్‌గా ఓ ఇంట‌రెస్టింగ్ రోల్ లో క‌నిపించ‌గా... కోట శ్రీ‌నివాస‌రావు, బ్ర‌హ్మానందం, ఆలీ, బాబూమోహ‌న్‌, ‘మ‌హ‌ర్షి’ రాఘ‌వ‌, గుండు హ‌నుమంత‌రావు, శ్రీ‌ల‌త, శివాజీరాజా, రాజార‌వీంద్ర‌, సుబ్బ‌రాయ శ‌ర్మ‌, వై.విజ‌య ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. సిస్ట‌ర్ సెంటిమెంట్…

Team TFNవాట్సాప్
60 Years For Appu Chesi Pappu Koodu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Appu Chesi Pappu Koodu Movie News,Appu Chesi Pappu Koodu Telugu Movie Latest News,Appu Chesi Pappu Koodu Movie New Upd
స్పెషల్

విజ‌యా వారి ‘అప్పుచేసి పప్పుకూడు’కి ష‌ష్టి పూర్తి

`విజ‌యా వారి` సినిమాలంటే... కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ క‌మ‌నీయ దృశ్య‌కావ్యాలని నాటి తెలుగు ప్రేక్ష‌కుల మాట‌. ఇప్ప‌టికీ ఈ సినిమాలు బుల్లితెర‌పై వినోదాన్ని పంచుతుంటాయి. ‘పాతాళ‌భైర‌వి’, ‘మిస్స‌మ్మ‌’, ‘మాయాబ‌జార్’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌ర్వాత ఈ సంస్థ అధినేత‌లు నాగిరెడ్డి, చక్ర‌పాణి నిర్మించిన సినిమా ‘అప్పుచేసి ప‌ప్పుకూడు’. త‌మిళంలో విడుద‌లైన ‘క‌డ‌న్‌ వాంగి క‌ళ్యాణం’కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. య‌న్.టి.రామారావు, సావిత్రి జంట‌గా ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు ఎల్‌.వి.ప్ర‌సాద్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో... జ‌మున‌, జ‌గ్గ‌య్య‌, ఎస్‌.వి.రంగారావు, ర‌మ‌ణారెడ్డి, రేలంగి, గిరిజ‌, సూర్య‌కాంతం…

Team TFNవాట్సాప్
Team Agent Sai Srinivasa Athreya Releases Sankranthi Special Poster,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Agent Sai Srinivasa Athreya Movie Updates,Agent Sai Srinivasa Athreya Telugu Movie Latest New
ఫస్ట్ లుక్

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫస్ట్ లుక్ రిలీజ్

స్వరూప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఇటీవలే ఈ సినిమా పోస్టర్ ని రిలీజ్ చేయగా..చాలా డిఫరెంట్ గా ఉండి ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఆయితే కాస్త డిఫరెంట్ గా రిలీజ్ చేశారు. మీ పందెం కోళ్లను ఎవరు మాయం చేశారో,మీ గాలిపటాల్ని తెంపేసిందెవరో మేము కనుక్కుంటాము.మీరు బొబ్బట్లు తిని పండగ చేస్కోండి అంటూ కామెడీగా చెబుతూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Kajal Aggarwal To Be Seen In A New Look For Bharateeyudu 2,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Actress Kajal Aggarwal Latest News,Heroine Kajal Aggarwal New Movie Updates,Kajal Aggarwal Next Film N
సినిమా వార్తలు

`భార‌తీయుడు 2` చిత్రం కోసం కాజ‌ల్ న్యూ లుక్‌

తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో న‌టించి... సంచ‌ల‌న‌ విజ‌యాల‌ను అందుకుంది టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ మ‌రో మెగా బ‌డ్జెట్ మూవీలో న‌టిస్తోంది. అదే... `భార‌తీయుడు 2`. లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా ఏస్ ఫిల్మ్ మేక‌ర్ శంక‌ర్ రూపొందించిన `భార‌తీయుడు` (1996)కు సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో.. హీరోయిన్‌గా న‌టించే బంప‌ర్ ఆఫ‌ర్‌ను కొట్టేసింది కాజ‌ల్‌. అంతేకాదు... ఈ సినిమాలో రెండు డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో క‌నిపించ‌నుంద‌ట‌. పాత్ర రీత్యా... ప‌డుచు అమ్మాయిగానూ, వ‌య‌సు మ‌ళ్ళిన స్త్రీగానూ కాజ‌ల్ క‌నిపించ‌నుంద‌ట‌. `వ‌య‌సు మ‌ళ్ళిన స్త్రీ`…

Team TFNవాట్సాప్
Naga Chaitanya Majili Secondd Look Out Now,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Majili Movie Updates,Majili Telugu Movie Latest News,Naga Chaitanya Majili 2nd Look Released
రిలీజ్ అప్‌డేట్

మజిలీ సెకండ్ లుక్ రిలీజ్- రిలీజ్ డేట్ ఖరారు

పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మజిలీ. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఫస్ట్ లుక్ లో సమంత-నాగచైతన్య ఉండగా..ఇప్పుడు దివ్యంశ కౌశిక్ - నాగ చైతన్య సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు. దానితో పాటు మూవీ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసేశారు. ఏప్రిల్ 5వ తేదీన సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేశారు.

TFN Adminవాట్సాప్
Adrushyam Movie Trailer Launch,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Adrushyam Movie Updates,Adrushyam Telugu Movie Latest News,Adrushyam Telugu Movie Trailer Launchd,Adrushyam Trailer,#AdrushyamTrai
ట్రైలర్ & టీజర్

అదృశ్యం ట్రైలర్ లాంచ్

వైష్ణవి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రవిప్రకాష్ కృష్ణం శెట్టి నిర్మించిన చిత్రం అదృశ్యం. హారర్, థ్రిల్లర్, కామెడి, ప్రధానాంశముగా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్ను శనివారం ఫిల్మిఛాంబర్లో హీరో జాన్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో... మ్యూజిక్ డైరెక్టర్ ఆల్డ్రిన్ మాట్లాడుతూ... తెలుగులో ఇది నా మొదటి చిత్రం. బేసిక్గా నేను తెలుగువాడిని కాకపోతే చెన్నైలో సెటిల్ అయ్యాను. శ్రవంతి మూవీస్కి వర్క్ చేశాను. నేను చెన్నైలో మ్యూజిక్ కోర్సు చేశాను. తమిళ్లో దాదాపుగా 7 చిత్రాలకు సంగీతాన్ని అందించాను. ఈ సంవత్సరం…

Team TFNవాట్సాప్
Balakrishna Trendsetter Samarasimha Reddy Completes 20 Years,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Samarasimha Reddy Movie Updates,Samarasimha Reddy Telugu Movie Latest News,Nandamuri Balakrishna Sam
స్పెషల్

ట్రెండ్ సెట్టింగ్ మూవీ ‘స‌మ‌ర‌సింహారెడ్డి’కి 20 ఏళ్ళు

తెలుగు సినిమా చరిత్ర‌లో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచిపోయే సినిమాలలో... న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టించిన ‘స‌మ‌ర‌సింహారెడ్డి’ ఒక‌టి. ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించ‌డంతో... కొన్నేళ్ళ పాటు తెలుగు సినిమా ఫ్యాక్ష‌న్ బాట ప‌ట్టింది. మ‌రికొన్ని ఘ‌న‌విజ‌యాల‌నూ మూట‌గ‌ట్టుకుంది. ఇక ‘స‌మ‌ర‌సింహారెడ్డి’ విష‌యానికొస్తే... నంద‌మూరి బాల‌కృష్ణలోని న‌టుడ్ని కొత్త‌గా ఆవిష్క‌రించిన చిత్ర‌మిది. న‌వ‌ర‌సాల‌ను అద్భుతంగా ప‌లికించి... అభిమానుల చేతే కాదు... స‌గ‌టు ప్రేక్ష‌కుల నుంచి కూడా జేజేలు అందుకున్నాడు. సిమ్రాన్‌, అంజలా ఝ‌వేరి, సంఘ‌వి హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాలో…

Team TFNవాట్సాప్
ప్లే బాయ్ క్యారెక్టర్లో విజయ్ దేవరకొండ?
సినిమా వార్తలు

ప్లే బాయ్ క్యారెక్టర్లో విజయ్ దేవరకొండ?

టాలీవుడ్‌లో `షార్ట్ టైమ్ బాయ్ ఫ్రెండ్‌`... అదే `ప్లే బాయ్` క్యారెక్ట‌ర్‌ల‌తో సంద‌డి చేస్తున్న క‌థానాయకుల సంఖ్య పెరుగుతోందా? దీనికి స‌మాధానంగా అవున‌నే చెప్పుకోవాలి. అప్పుడెప్పుడో 18 ఏళ్ళ క్రితం `ప్రేమ‌తో...రా!` అంటూ విక్ట‌రీ వెంక‌టేష్ ప్లే బాయ్ గా అల‌రిస్తే... 8 ఏళ్ళ‌ క్రితం మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ `ఆరెంజ్‌`తో షార్ట్ ట‌ర్మ్ ల‌వ్‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. మ్యూజిక‌ల్ గా ఈ రెండు సినిమాలూ మెప్పించాయి. ఇక వ‌ర్త‌మానంలోకి వ‌స్తే... అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతున్న `Mr. మ‌జ్ను` కూడా ఓ షార్ట్ టైమ్ బాయ్ ఫ్రెండ్ క‌థే. ఇప్పుడు ఈ హీరోల బాట‌లోనే... యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా…

Team TFNవాట్సాప్
Dil Raju and Anil Ravipudi Gift Another Hit to Mehreen with F2,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Actress Mehreen Latest News,Heroine Mehreen New Movie Updates,Mehreen Pirzada latest News
సినిమా వార్తలు

మెహ‌రీన్ కు మ‌రోసారి క‌లిసొచ్చారు

కెరీర్ ఆరంభంలో వ‌రుస‌గా మూడు విజ‌యాల‌ను అందుకుని `హ్యాట్రిక్ హీరోయిన్` అనిపించుకుంది... పంజాబీ జాబిలి మెహ‌రీన్‌. `కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ‌`, `మ‌హానుభావుడు`, `రాజా ది గ్రేట్‌` చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ‌... ఆ త‌రువాత మాత్రం ఆ స్థాయి విజ‌యాల‌ను అందుకోలేక‌పోయింది. ఈ నేప‌థ్యంలో... సంక్రాంతి కానుక‌గా శ‌నివారం విడుద‌లైన `ఎఫ్ 2` హిట్ టాక్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా... వ‌సూళ్ళ ప‌రంగానూ మెప్పిస్తోంది. దీంతో... మెహ‌రీన్ మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కేసిన‌ట్లే. కేవ‌లం స‌క్సెస్ మాత్ర‌మే కాదు... న‌టిగానూ మ‌రోసారి త‌న ప్ర‌తిభ‌ను చాటుకుంది ఈ పంజాబీ జాబిలి. `హ‌నీ ఈజ్ ద బెస్ట్‌`…

Team TFNవాట్సాప్
Sankranthi 2019 Telugu Movie Collections,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sankranthi 2019 Telugu Movies Box Office Collections
బాక్సాఫీస్

సంక్రాంతి సినిమాల లేటెస్ట్ కలెక్షన్స్

ఈ సంక్రాంతికి పలు సినిమాలే బరిలో దిగాాయి. జనవరి 9వ తేదీన ఎన్టీఆర్ కథానాయకుడు, జనవరి 10 వ తేదీన పేట, జనవరి 11వ తేదీన వినయ విధేయ రామ, జనవరి 12 ఎఫ్2 సినిమాలు రిలీజయ్యాయి. ఒక్కొక్క జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాలు ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. మరి ఈ సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

Team TFNవాట్సాప్
Hollywood Actor Michael Madson in Anushka New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Kill Bill actor Michael Madsen joins Anushka Shetty,Finally Anushka Shetty gets Hollywood Villain
సినిమా వార్తలు

అనుష్క సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరో

భాగ‌మ‌తి మూవీ త‌ర్వాత దాదాపు అనుష్క సినిమా వచ్చి దాదాపు సంవ‌త్స‌రమైపోయింది. అప్పటి నుండి ఇప్పటివరకూ అనుష్క కొత్త సినిమా మాత్రం ప్రారంభం కాలేదు. ఇక ఈ ఏడాది అనుష్క కొత్త మూవీకి సైన్ చేసింది. థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్ తో... హేమంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ మార్చి నుండి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
Controversial Comments on Balayya, Latest Telugu Movies News, Naga Babu Opens Up About Balakrishna Comment on Mega Family, Naga Babu Opens Up About Balakrishna Comments, Naga Babu Opens Up About Nandamuri Balakrishna Comments, Naga Babu Sensational C
ఇంటర్వ్యూ

బాలయ్యకు డైరెక్ట్ గానే కౌంటర్ ఇచ్చిన నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు మరోసారి బాలకృష్ణపై సెటైర్లు వేశారు. గతంలో బాలయ్య అంటే ఎవరో తెలియదని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో అసలు రచ్చ మొదలైంది. ఇక నాగబాబు చేసిన వ్యాఖ్యలకు బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున స్పందించి నాగబాబుపై విమర్శలు గుప్పించారు. దాంతో నాగబాబు ఆ విమర్శలపై స్పందించి... సారీ బాలయ్య నాకు తెలియకపోవడం ఏంటీ.. ఆయన చాలా మంచి కమెడియన్.. నాకు తెలియదని చెప్పడం తప్పే అంటూ ఆనాటి కమెడియన్ బాలకృష్ణ ఫొటో చూపిస్తూ.. కాస్త ఎటకారంగానే సమాధానం ఇచ్చారు. దాంతో బాలకృష్ణ అభిమానులు ఇంకా రెచ్చిపోయి నాగబాబుపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు.. ఇంకా విమర్శిస్తునే ఉన్నారు.

TFN Adminవాట్సాప్
Sukumar – Mahesh Babu Film to Kick Start from June,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Director Sukumar Latest News,Sukumar New Movie With Superstar Mahesh Babu,Mahesh Babu And Sukumar New Movie S
సినిమా వార్తలు

జూన్ నుంచి మ‌హేష్, సుకుమార్ చిత్రం?

గ‌త ఏడాది వేస‌వికి `భ‌ర‌త్ అనే నేను`తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను అందుకున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు... ఈ ఏడాది వేస‌వికి `మ‌హ‌ర్షి`తో ప‌ల‌క‌రించ‌నున్నాడు. అంతేకాదు... ఈ సినిమాతో క‌థానాయ‌కుడిగా 25 చిత్రాల మైలురాయికి చేరుకుంటున్నాడు ఈ హ్యాండ్స‌మ్ హీరో. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్ర‌ముఖ నిర్మాత‌లు సి.అశ్వ‌నీద‌త్‌, `దిల్‌` రాజు, ప్ర‌సాద్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న `మ‌హ‌ర్షి` తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే... ఈ చిత్రం విడుద‌లయ్యాక త‌న కుటుంబంతో క‌ల‌సి స‌మ్మ‌ర్ వెకేష‌న్ ఎంజాయ్ చేయ‌నున్న మ‌హేష్... జూన్ నుంచి త‌న త‌దుప‌రి చిత్రాన్ని…

Team TFNవాట్సాప్
Latest Update on Murugadoss and Rajinikanth Film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,AR Murugadoss Upcoming Movie News,Rajinikanth Next Film with AR Murugadoss,Superstar Rajinikanth New Movie AR M
సినిమా వార్తలు

ర‌జ‌నీకాంత్, మురుగ‌దాస్ సినిమా అప్‌డేట్‌

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కొత్త చిత్రం `పేట‌`... ఈ సంక్రాంతికి విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. `బాషా` త‌రువాత మ‌ళ్ళీ 24 ఏళ్ళ అనంత‌రం ... సంక్రాంతికి వ‌స్తున్న ర‌జ‌నీకాంత్ సినిమా కావ‌డంతో... `పేట‌`పై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ నెల 10న త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఈ సినిమా విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే... `పేట‌` రిలీజ్ అయిన వెంట‌నే... ర‌జ‌నీ త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కించ‌నున్నార‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం... బ్రిలియంట్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న ఈ సినిమా ఫిబ్ర‌వ‌రిలో ప‌ట్టాలెక్క‌నుంద‌ని తెలుస్తోంది. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా…

Team TFNవాట్సాప్
Sye Raa Narasimha Reddy New Schedule To Begin After Sankranti,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sye Raa Movie Updates,Sye Raa Telugu Movie Latest News,Megastar Chiranjeevi Sye Raa Movie New Sche
షూటింగ్ అప్‌డేట్

స‌ంక్రాంతి త‌రువాతే `సైరా` నెక్ట్స్ షెడ్యూల్

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత‌ భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం `సైరా న‌రసింహారెడ్డి`. తొలి తెలుగు స్వాతంత్ర్య స‌మ‌ర యోధుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా... మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇప్ప‌టికే స‌గానికి పైగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ సినిమాకి సంబంధించి... త‌దుప‌రి షెడ్యూల్ సంక్రాంతి త‌రువాత హైద‌రాబాద్‌లోని ఓ స్టూడియోలో జ‌రుగ‌నుంద‌ని స‌మాచారం. అంతేకాదు... మార్చి చివ‌రి నాటికి చిత్రీక‌ర‌ణ పూర్తిచేసి... ఆ త‌రువాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ప్రారంభించ‌నున్నార‌ని…

Team TFNవాట్సాప్
14 Years For Pawan Kalyan Balu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Balu Movie Updates,Balu Telugu Movie Latest News,Balu Movie Completed 14 Years,Powerstar Pawan Kalyan Balu Movie Latest New
స్పెషల్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ `బాలు`కి 14 ఏళ్ళు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘తొలిప్రేమ‌’. 1998లో విడుదలైన ఈ చిత్రంతోనే ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేశాడు `ప్రేమ‌క‌థా చిత్రాల స్పెష‌లిస్ట్` ఎ.కరుణాకరన్. దాదాపు ఏడేళ్ళ‌ విరామం త‌రువాత‌... ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న మ‌రో మ్యూజిక‌ల్ హిట్ `బాలు`. వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత సి. అశ్వ‌నీద‌త్ నిర్మించిన ఈ సినిమాలో ప‌వ‌న్‌కి జోడీగా శ్రియ, నేహా ఒబెరాయ్‌ న‌టించ‌గా... జ‌య‌సుధ‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి, సునీల్, బాలీవుడ్ న‌టుడు గుల్ష‌న్ గ్రోవ‌ర్ తదిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో కనిపించారు.

Team TFNవాట్సాప్

షేర్