లేడి ఓరియెంటెడ్ సినిమాల కేరాఫ్ అడ్రస్ ఎవరంటే ముందు గుర్తొచ్చేది అనుష్కనే. ఇప్పుడు తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించడానికి రెడీ అవుతోంది. హేమంత్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాకు సంబంధించి తాజాగా ప్రెస్ రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనుష్క శెట్టి, మాధవన్, అంజలి, షాలిని పాండే ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి నెలలో అమెరికా లో ప్రారంభంకానుందని తెలిపారు. 2019 ద్వితీయార్ధంలో చిత్రం విడుదల అవుతుందని, సినిమా ప్రేక్షకులకు, అభిమానులకు, మీడియా వారికి చిత్ర నిర్మాణ సంస్థల అధినేతలు టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ లు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలుగు, తమిళం, హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణుల తో నిర్మితమవుతున్న తొలి క్రాస్ ఓవర్ చిత్రమిది.
కాగా హేమంత్ దర్శకత్వం లో హార్రర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చనున్నాడు. ఈ సినిమాకు ‘సైలెన్స్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది.
[youtube_video videoid=tZO3kf6ZRNg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: