మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వాటిలో ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ ఒకటి. ఇందులో చిరంజీవికి జోడీగా విజయశాంతి నటించగా… ‘అభినేత్రి’ వాణిశ్రీ భారీ విరామం తర్వాత ఈ చిత్రంలోని అత్త పాత్రతో మళ్ళీ తెలుగులో రీ-ఎంట్రీ ఇచ్చారు. కైకాల సత్యనారాయణ, అన్నపూర్ణ, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, గిరిబాబు, బ్రహ్మానందం ముఖ్యపాత్రలను పోషించారు. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించారు. చిరు, వాణిశ్రీ పాత్రల మధ్య సాగే ‘ఛాలెంజ్’ సన్నివేశాలు… అలాగే చిరు, విజయశాంతి పాత్రల మధ్య సాగే కామెడీ, రొమాంటిక్ సీన్స్‌తో పాటు… సంగీత దర్శకుడు చక్రవర్తి స్వరపరచిన పాటలు కూడా చిత్ర విజయానికి దోహదపడ్డాయి. ‘మెరుపులా’,‘కలలో పెట్టని ముద్దులు పెట్టు’, ‘టింగు రంగ చక్కనమ్మ’, ‘దిగు దిగు దిగు భామ’, ‘శాంతి ఓం శాంతి’ పాటలు అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడిని కూడా అలరించాయి. ఈ సినిమాని హిందీలో అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ జంటగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘జమైరాజా’గా రీమేక్ చేయగా… తమిళంలో రజనీకాంత్, అమల జోడీగా రాజశేఖర్ డైరెక్షన్‌లో ‘మాపిళ్ళై’ పేరుతో పునర్నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14, 1989న విడుదలైన ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ … నేటితో 30 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: