`దిల్` రాజుకు మ‌రోసారి అచ్చొచ్చిన సంక్రాంతి

Dil Raju Luck Continues For This Sankranthi Too,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Dil Raju Latest News,Dil Raju New Movie Updates,Dil Raju Next Film Updates
Dil Raju Luck Continues For This Sankranthi Too

నిర్మాత‌గా `దిల్` రాజుది 15 ఏళ్ళ ప్ర‌యాణం. ఈ జ‌ర్నీలో సింహ‌భాగం విజ‌యవంత‌మైన చిత్రాల‌ను అందించి… మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ అనిపించుకున్నారాయ‌న‌. 2017లో అయితే… డబుల్ హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకుని ఓ సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. ఇదిలా ఉంటే… సంక్రాంతి కానుక‌గా ఆయ‌న అందించిన తాజా చిత్రం `ఎఫ్ 2` బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తోంది. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా… మొద‌టి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా క‌లెక్ష‌న్ల విష‌యంలోనూ దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… సంక్రాంతి సీజ‌న్‌లో రాజు నుంచి వ‌చ్చిన‌ నాలుగో చిత్ర‌మిది. గ‌తంలో ఆయ‌న నిర్మించిన `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`, `ఎవ‌డు`, `శ‌తమానం భ‌వ‌తి` చిత్రాలు సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించ‌గా… ఇప్పుడు `ఎఫ్ 2` కూడా అదే బాట‌లో వెళుతోంది. ఒక‌ప్పుడు స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో భారీ విజ‌యాల‌ను అందుకున్న రాజు… ఇప్పుడు సంక్రాంతి సీజ‌న్‌లోనూ భారీ విజ‌యాల‌ను అందుకుంటూ `సంక్రాంతి` రాజు అనిపించుకుంటున్నారు. హార్టీ కంగ్రాట్స్ టు మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ `దిల్‌` రాజు!

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.