కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 67

సినిమా వార్తలు

త‌మ‌న్నా స్థానంలో తాప్సీ?

`రాజు గారి గ‌ది` ఫ్రాంచైజీలో మూడో చిత్రంగా `రాజు గారి గ‌ది 3` రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. తొలి రెండు సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఓంకార్... ఈ మూడో చిత్రాన్ని కూడా తెర‌కెక్కించ‌నున్నాడు. `రాజు గారి గ‌ది` లో పూర్ణ, `రాజు గారి గ‌ది 2`లో స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌గా... `రాజు గారి గ‌ది 3` కోసం త‌మ‌న్నాని ఎంచుకున్నాడు ద‌ర్శ‌కుడు. దానికి త‌గ్గ‌ట్టే... ప్రారంభోత్స‌వం రోజున త‌మ‌న్నాపై ముహుర్తపు స‌న్నివేశాన్ని చిత్రీక‌రించారు కూడా.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సైరా మూవీ కాంట్రవర్సీ వెనుక నిజాలు

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా స్టార్ చిరంజీవి హీరోగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ మూవీ సైరా నరసింహారెడ్డి భారీ బడ్జెట్, భారీ తారాగణం తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కుటుంబీకులకు కొంత కాంపెన్సేషన్ ఇవ్వడానికి నిర్మాత రామ్ చరణ్ అంగీకరించారు. జూన్ 30 వ తేదీన రామ్ చరణ్ ఆఫీస్ ముందు కొంతమంది నరసింహారెడ్డి వారసులం అని పెద్ద గొడవ చేశారు.

Team TFNవాట్సాప్
Nagarjuna To Pair Up With Pooja Hegde,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Nagarjuna Next Film With Pooja Hegde in Bangarraju,Nagarjuna Upcoming Movie News,Nagarjuna Next Film Updates,Nagarjuna New
సినిమా వార్తలు

నాగ్‌కి జోడీగా పూజా హెగ్డే?

కింగ్ నాగార్జున కెరీర్‌లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిల‌చిన `సోగ్గాడే చిన్ని నాయ‌నా`కి కొన‌సాగింపుగా `బంగార్రాజు` పేరుతో సీక్వెల్ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌య్యింద‌ని టాక్‌. అంతేకాదు, ఆగ‌స్టులో చిత్రీక‌ర‌ణ ప్రారంభించి... 2020 సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని నాగ్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
#RanaDaggubati, Hero Rana Daggubati Upcoming Movie News, Latest Telugu Movies News, Rana Daggubati Latest News, Rana Daggubati Next Film Updates, Rana Daggubati Next Film With Rajinikanth Director, Rana Daggubati To Work With Rajinikanth Director, Te
సినిమా వార్తలు

ర‌జినీ ద‌ర్శ‌కుడితో రానా?

పాన్ - ఇండియా యాక్ట‌ర్‌గా పేరుతెచ్చుకున్న రానా... ప్ర‌స్తుతం ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. ఒక‌వైపు సోలో హీరోగా న‌టిస్తూనే... మ‌రో వైపు మ‌ల్టీస్టార‌ర్ మూవీస్‌లోనూ సంద‌డి చేస్తున్నాడు ఈ టాలెంటెడ్ స్టార్‌. ప్ర‌స్తుతం బాలీవుడ్ మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ `హౌస్‌ఫుల్ 4` (అక్ష‌య్ కుమార్), `భుజ్‌: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా` (అజ‌య్ దేవ‌గ‌ణ్‌)లో న‌టిస్తున్న రానా... తాజాగా మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడని టాక్‌.

Team TFNవాట్సాప్
Nishabdam Movie Completes 50% Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Nishabdam Movie Updates,Nishabdam Telugu Movie Latest News,#Nishabdam,Shoot For Madhavan-Anushka Shetty Silence Is Fifty Per
సినిమా వార్తలు

50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న 'నిశ్శ‌బ్దం'

`భాగ‌మతి` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న సినిమా `నిశ్శ‌బ్దం`. మ‌ల్టీలింగ్వ‌ల్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌... ఇత‌ర భాష‌ల్లో `సైలెన్స్‌` పేరుతో రూపొందుతోంది. హేమంత్‌ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అనుష్క‌తో పాటు మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలిని పాండే, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, సుబ్బ‌రాజు త‌దిత‌ర ప్ర‌ముఖ న‌టులు ముఖ్య భూమిక‌లు పోషిస్తున్నారు. కాగా... శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా 50 శాతం షూటింగ్ పార్ట్ పూర్త‌య్యింది. ఈ విష‌యాన్ని చిత్ర ద‌ర్శ‌కుడు హేమంత్ మ‌ధుక‌ర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో…

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

సాహో లో నా షూట్ కంప్లీట్ - ఇన్ క్రెడిబుల్ జర్నీ

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెడుతోంది. ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానున్న ఈ చిత్ర టీజ‌ర్ రీసెంట్‌గా విడుద‌లై సంచ‌ల‌నాలు సృష్టించింది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. ఆస్ట్రియాలోని కొన్ని అందమైన లోకేషన్లలో ప్రభాస్, శ్రద్దా మద్య ఓపాటను చిత్రీకరించారు.

TFN Adminవాట్సాప్
Virata Parvam Completes Its First Schedule,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Virata Parvam Movie Updates,Virata Parvam Telugu Movie Latest News,Virata Parvam Movie Shooting Updates,Virata Parvam
షూటింగ్ అప్‌డేట్

ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న విరాటపర్వం

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా తెలంగాణలోని ధరిపల్లె అనే గ్రామంలో షూటింగ్ జరుపుకుంటుండగా అది పూర్తయింది. రెండో షెడ్యూల్ అప్ డేట్ త్వరలోనే ఇవ్వనున్నారు.

TFN Adminవాట్సాప్
Meghamsh Starrer RajDooth Trailer Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,RajDooth Movie Trailer,RajDooth Telugu Movie Trailer,RajDooth Theatrical Trailer,RajDooth Movie Updates,RajDooth Telugu Mo
ట్రైలర్ & టీజర్

రాజ్ దూత్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

MLV సత్యనారాయణ (సత్తిబాబు ) నిర్మాణ సారథ్యంలో లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అర్జున్ - కార్తీక్ దర్శకత్వంలో రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి, నక్షత్ర జంటగా రూపొందిన రాజ్ దూత్ మూవీ జులై నెలలో రిలీజ్ కానుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన రాజ్ దూత్ మూవీ కి వరుణ్ సునీల్ సంగీతం అందించారు. బాల నటుడిగా నటించిన మేఘాంశ్ ఈ మూవీ తో హీరోగా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు.

Team TFNవాట్సాప్
Tollywood Actors Need to Speed Up Their Movies,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Tollywood Actors Latest News,South Actors Upcoming Movie News,Telugu Actors Next Film Updates,Tollywood Actors Nex
సినిమా వార్తలు

స్పీడ్ పెంచకపోతే కష్టం మాష్టార్లు

పాతం తరంలో ఎంత మంది హీరోలు ఉన్నా వెంటనే గుర్తొచ్చే స్టార్ హీరోలు మాత్రం ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణ రాజు వీళ్లే.. ఆ తరువాత తరంలో కూడా ఎంతో మంది హీరోలు తెలుగు తెరకు పరిచయమయ్యారు... కానీ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జుననే అగ్ర హీరోలుగా నిలిచారు. వారి తరువాత జనరేషన్ కు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, నితిన్, శర్వానంద్, రానా, నిఖిల్, సందీప్ కిషన్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది.

TFN Adminవాట్సాప్
Director Vijay Marriage In July,Director AL Vijay Set To Marry Again,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Director AL Vijay's marriage date fixed,Amala Paul ex-husband director Vijay ready for secon
సినిమా వార్తలు

జూలై లో దర్శకుడు విజయ్ మ్యారేజ్

సూపర్ హిట్ కిరీడం మూవీ తో కోలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమైన AL విజయ్ దర్శకత్వంలో రూపొందిన మదరాసిపట్టినం, దైవ తిరుమగళ్, తాండవం మూవీస్ ఘనవిజయం సాధించాయి. అభినేత్రి, కణం, అభినేత్రి 2 మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. AL విజయ్ ప్రస్తుతం తమిళ నాడు దివంగత CM జయలలిత బయోపిక్ మూవీ తలైవి ని కంగనా రనౌత్ హీరోయిన్ గా రూపొందిస్తున్నారు. 2014 సంవత్సరంలో హీరోయిన్ అమలాపాల్ ను వివాహం చేసుకున్నారు. 2017 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు.

Team TFNవాట్సాప్
Kalki Movie Mouth Talk,Latest Telugu Movie Reviews, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Kalki Movie Public Talk,Kalki Movie Review, Kalki Movie Review And Ratings,Kalki Movie Story, Kalki Revi
సినిమా వార్తలు

కల్కి మూవీ మౌత్ టాక్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

Team TFNవాట్సాప్
Latest Telugu Movie Reviews, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Brochevarevarura Movie Public Talk, Brochevarevarura Movie Review, Brochevarevarura Movie Review And Ratings, Brochevarevarura
సినిమా వార్తలు

బ్రోచేవారెవరురా మూవీ మౌత్ టాక్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movies News,Celebrities Pay Homage To Vijaya Nirmala Garu, Superstar Krishna Wife Vijaya Nirmala demise, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Celebs About Veteran Actress Demise, Tollywood Celebs About Vijaya Nirmala
సినిమా వార్తలు

బహుముఖ ప్రజ్ఞాశాలికి సినీ - రాజకీయ ప్రముఖులు ఘన నివాళులు

గత కొంతకాలంగా కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో సినీ పరిశ్రమ మరో ఆణిముత్యాన్ని కోల్పొయిందని ఇప్పటికే పలువురు సినీ-రాజకీయ సెలబ్రిటీలు సంతాపం తెలిపారు. ఆమె పార్థీవ దేహాన్ని దర్శించడానికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా కదలివచ్చారు.

TFN Adminవాట్సాప్
నేను బాగానే ఉన్నాను - రూమర్లకు అనుష్క చెక్
సినిమా వార్తలు

నేను బాగానే ఉన్నాను - రూమర్లకు అనుష్క చెక్

ప్రస్తుతం అనుష్క హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్న 'నిశ్శబ్దం' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పలు లాంగ్వెజస్ లో రూపొందుతున్న ఈసినిమా ఇతర భాషల్లో 'సైలెన్స్' పేరుతో రిలీజ్ కానుంది. అమెరికాలోని సియాటిల్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కల్కీ రన్ టైమ్ లాక్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా కల్కీ. రేపు విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్ర బృందం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. తాజాగా ఈసినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేశారు. 2 గంటల 22 నిమిషాల రన్ టైమ్ కలిగి ఉంది. మరి ఒక థ్రిల్లర్ మూవీకి ఇంత టైమ్ అంటే గొప్ప విషయమే. మరి సినిమా ఎలా ఉంటుందో చూద్దాం.

TFN Adminవాట్సాప్
#RIPVijayaNirmalaGaru, Vijaya Nirmala Passes On Her Favourite Day,Vijaya Nirmala passes away,Superstar Krishna Wife Vijaya Nirmala demise, Veteran Actress Vijaya Nirmala Passes Away,Tollywood Celebs About Veteran Actress Demise,Vijaya Nirmala passes
సినిమా వార్తలు

తనకు ఇష్టమైన రోజే నిష్క్రమించిన విజయనిర్మల

నటి, డైరెక్టర్, నిర్మాత ఇలా తెలుగు సినీ కళామతల్లికి ఎనలేని సేవలు అందించిన అలనాటి అందాల తార విజయనిర్మల గత రాత్రి తిరిగిరాని లోకాలకు వెళ్లి తెలుగు సినీ ఇండస్ట్రీకి ఒక తీరని లోటును మిగిల్చారు. విజయ నిర్మల మృతిపై అటు సినీ ప్రముఖులతో పాటు ఇటు పలు రాజకీయ నేతలు కూడా సంతాపం తెలియజేస్తున్నారు. తన సినీ జీవితంలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు విజయనిర్మల. రంగుల రాట్నం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన విజయనిర్మల ఆ తరువాత వెనక్కిచూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక సాక్షి సినిమాలో జంటగా నటించిన కృష్ణ. విజయనిర్మల ఆ పరిచయంతో రియల్ లైఫ్ లో కూడా జీవితభాగస్వామ్యులుగా మారి ఆ తరువాత ఏకంగా 40కు పైగా సినిమాల్లో కలిసి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

డిటెక్టివ్ పాత్రలలో టాలీవుడ్ హీరోలు

హాలీవుడ్ లో రూపొందే జేమ్స్ బాండ్ మూవీస్ కు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకాదరణ ఉంది. బెంగాలీ సాహిత్యం లో డిటెక్టివ్ సాహిత్యం ఒక వెలుగు వెలిగింది. కొవ్వలి, టెంపోరావ్, కొమ్మూరి సాంబశివరావు, మధు బాబు ల తెలుగు డిటెక్టివ్ సాహిత్యం కుర్రకారును ఒక ఊపు ఊపింది. డిటెక్టివ్ నవలలోని డిటెక్టివ్ వాలి, యుగంధర్, షాడో , బుల్లెట్ పాత్రలు ప్రేక్షకాదరణ పొందాయి. బెంగాలీ డిటెక్టివ్ సాహిత్యానికి ప్రభావితుడైన నిర్మాత చక్రపాణి మిస్సమ్మ మూవీ లో ANR ను లోకల్ డిటెక్టివ్ పాత్రలో నటింపజేశారు.

Team TFNవాట్సాప్
స్పెషల్

ఆమె అస్తమయంతో కృష్ణ పక్ష తిమిరంలోకి కృష్ణ జీవితం

స్వభావరీత్యా పురుషాధిక్య లక్షణం కలిగిన చిత్ర పరిశ్రమలో మహిళా విజయానికి, మహిళా వికాసానికి, మహిళా గళానికి రిప్రజెంటింగ్ పర్సనాలిటీగా ఎదిగిన అసామాన్య వ్యక్తిత్వ మూర్తి శ్రీమతి విజయనిర్మల. ప్రతిభ, పట్టుదల, కార్యదక్షత, నాయకత్వ లక్షణాలలో తన భర్త సూపర్ స్టార్ కృష్ణకు ఏ మాత్రం తీసిపోని సమర్థత విజయనిర్మల సొంతం. తెలుగు, తమిళ, మళయాల రంగాలలో కొద్ది రోజుల తేడాతో హీరోయిన్ గా పరిచయమై మూడు రంగాలలో తొలి చిత్రంతోనే విజయాలు సాధించి హ్యాట్రిక్ హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ విజయనిర్మల. అలాగే దర్శకురాలిగా ముందు మలయాళంలో తొలి ప్రయత్నం చేసి విజయాన్ని అందుకుని తెలుగులో మీనా చిత్రం ద్వారా…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఈ ఏడాదిలోనూ టాలీవుడ్‌ జూలై సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందా?

గత ఐదేళ్లుగా టాలీవుడ్‌కు జూలై నెల బాగా కలిసొస్తోంది. ముఖ్యంగా... 2014 నుంచి ఈ నెలలో విడుదలైన తెలుగు సినిమాలు అనూహ్య‌ విజయాలను సాధిస్తూ... బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గ‌డ‌చిన ఐదేళ్ళ‌లో టాలీవుడ్ జూలై ట్రాక్ రికార్డ్‌ను ఒక‌సారి పరిశీలిస్తే ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. 2014లో విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన ‘దృశ్యం’తో మొద‌లైన ఈ `జూలై` విజ‌యప‌రంప‌ర... 2015లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి: ది బెగినింగ్’తో మ‌రో స్థాయికి వెళ్ళింది. అనంత‌రం 2016లో వచ్చిన ‘పెళ్లి చూపులు’, 2017లో విడుదలైన ‘ఫిదా’, 2018లో వచ్చిన ‘ఆర్ ఎక్స్ 100’ ఘ‌న‌విజ‌యాలు సాధించ‌డంతో టాలీవుడ్‌లో జూలై…

Team TFNవాట్సాప్

షేర్