కింగ్ నాగార్జున కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలచిన `సోగ్గాడే చిన్ని నాయనా`కి కొనసాగింపుగా `బంగార్రాజు` పేరుతో సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని టాక్. అంతేకాదు, ఆగస్టులో చిత్రీకరణ ప్రారంభించి… 2020 సంక్రాంతికి విడుదల చేయాలని నాగ్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందని సమాచారం.
ఇదిలా ఉంటే… మల్టీస్టారర్ మూవీగా రూపొందుతున్న ఈ సీక్వెల్లో నాగ్‌తో పాటు ఆయన తనయుడు నాగచైతన్య కూడా నటించనున్నాడు. కాగా, ఇప్పటికే చైతూకి జోడీగా కీర్తి సురేష్ నటించబోతోందని వార్తలు రాగా… ఇప్పుడు నాగ్‌కి జోడీగా పూజా హెగ్డే ఎంపికైందని టాలీవుడ్ టాక్. అయితే… పూజ ఎంట్రీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే… ఐదేళ్ళ క్రితం నాగ్ నిర్మాణంలో చైతూ హీరోగా రూపొందిన `ఒక లైలా కోసం`లో పూజ నాయికగా నటించింది. కట్ చేస్తే… ఇప్పుడు నాగ్, చైతూ కలసి నటిస్తున్న సినిమాలో నాగ్‌కి జోడీగా పూజ నటించనుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.