కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా స్టార్ చిరంజీవి హీరోగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ మూవీ సైరా నరసింహారెడ్డి భారీ బడ్జెట్, భారీ తారాగణం తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కుటుంబీకులకు కొంత కాంపెన్సేషన్ ఇవ్వడానికి నిర్మాత రామ్ చరణ్ అంగీకరించారు. జూన్ 30 వ తేదీన రామ్ చరణ్ ఆఫీస్
ముందు కొంతమంది నరసింహారెడ్డి వారసులం అని పెద్ద గొడవ చేశారు.
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కి ముగ్గురు భార్యలు. ఇప్పుడు విలేజ్ లో ఉండేవారంతా వారసులం అని గొడవకు దిగారు. మెగా ఫ్యామిలీ కి ఆప్తుడైన నిర్మాత NV ప్రసాద్ ఈ సైరా కాంట్రవర్సీ గురించి వివరించారు. కొంత మంది వ్యక్తులు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వారసులం అంటూ సైరా మూవీ టీమ్ ను మనీ కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారని , దానిని సహించబోమని ఆయన తెలిపారు. ఉయ్యాలవాడ విలేజ్ లో సైరా మూవీ సింగిల్ సీన్ కూడా చిత్రీకరించలేదని, బ్లాక్ మెయిల్ చేసేవారితో లీగల్ గా ఫైట్ చేస్తామని, నరసింహా రెడ్డి విగ్రహం ఆ విలేజ్ కు ఇస్తానని చిరంజీవి ప్రామిస్ చేశారని ఆయన చెప్పారు.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.