నటి, డైరెక్టర్, నిర్మాత ఇలా తెలుగు సినీ కళామతల్లికి ఎనలేని సేవలు అందించిన అలనాటి అందాల తార విజయనిర్మల గత రాత్రి తిరిగిరాని లోకాలకు వెళ్లి తెలుగు సినీ ఇండస్ట్రీకి ఒక తీరని లోటును మిగిల్చారు. విజయ నిర్మల మృతిపై అటు సినీ ప్రముఖులతో పాటు ఇటు పలు రాజకీయ నేతలు కూడా సంతాపం తెలియజేస్తున్నారు. తన సినీ జీవితంలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు విజయనిర్మల. రంగుల రాట్నం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన విజయనిర్మల ఆ తరువాత వెనక్కిచూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక సాక్షి సినిమాలో జంటగా నటించిన కృష్ణ. విజయనిర్మల ఆ పరిచయంతో రియల్ లైఫ్ లో కూడా జీవితభాగస్వామ్యులుగా మారి ఆ తరువాత ఏకంగా 40కు పైగా సినిమాల్లో కలిసి నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక 2002లో గిన్నీస్ బుక్‌లో ఆమె పేరు చోటు సంపాదించారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు (44) దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా కూడా ఆమె చరిత్ర సృష్టించారు. ఆమెకు రఘుపతి వెంకయ్య అవార్డు కూడా దక్కింది.
ఇన్ని విజయాలు చవిచూసిన విజయనిర్మల కు ఆమె మరణం కూడా తలొంచినట్టుంది. సాయిబాబా భక్తురాలైన విజయనిర్మలకు గురువారం అంటే చాలా ఇష్టమట. అందుకే తాను అనారోగ్యానికి గురైనప్పుడల్లా డాక్టర్లతో.. ‘పోవడం, పోవకపోవడం అలా ఉంచండి.. కానీ ఎప్పుడు పోయినా గురువారం నాడే జరుగుతుంది.. నేను గురువారమే మరణిస్తా’ అని చెప్పేవారట. ఆమె కోరుకున్నట్లుగానే తెల్లవారితే గురువారం అనగానే ఆమె మరణించారు. మరి ఇలా ఇచ్చామరణం ఎవరికో కానీ రాదు… ఇష్టమైన రోజు చనిపోయే అదృష్టం కూడా ‘విజయ’ నిర్మలనే వరించింది.
[subscribe]
[youtube_video videoid=UXvnawXp3SY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























