కల్కీ మూవీ రివ్యూ

Kalki Movie Mouth Talk, Kalki Movie Public Talk, Kalki Movie Review, Kalki Movie Review And Ratings, Kalki Movie Story, Kalki Review, Kalki Telugu Movie Live Updates, Kalki Telugu Movie Public Response, Kalki Telugu Movie Review, Latest Telugu Movie Reviews, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Kalki Telugu movie review

‘గరుడు వేగ’ సినిమా తరువాత యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కల్కీ. టీజర్, ట్రైలర్ల వల్ల మొదటి నుండే ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి గరుడవేగ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన రాజశేఖర్ కు ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అందించిందో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు – రాజశేఖర్‌, అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు
దర్శకత్వం : ప్రశాంత్ వర్మ
నిర్మాత : సి.కళ్యాణ్
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫర్ : దాశరథి శివేంద్ర

కథ: కొల్లాపూర్ అనే గ్రామంలో పెరుమాండ్లు(శత్రు) ఎమ్మెల్యే నర్సప్ప(అశుతోష్ రాణా) ఇద్దరూ కలిసే పలు అరాచకమైన పనులకు పాల్పడుతుంటారు. ఆ ఊరి ప్రజలకు వారిద్దరినీ చూస్తూనే భయంతో ఒణికిపోయేలా ఉండేవారు. కానీ ఎమ్మెల్యే నర్సప్ప తమ్ముడు శేఖర్ బాబు (సిద్దు జొన్నలగడ్డ) మాత్రం మంచి పేరు తెచ్చుకుంటాడు. ఈ క్రమంలో కొన్ని కారణాల వల్ల పెరుమాండ్లకు, నర్సప్పకు మధ్య కొన్ని విభేధాలు తలెత్తి ఒకరిపై ఒకరు ఆగ్రహంతో రగిలిపోతుంటారు. ఇలాంటి సమయంలో శేఖర్ బాబు ను చెట్టుకు కట్టేసి అతి దారుణంగా కాల్చి చంపేస్తారు. దాంతో శేఖర్ బాబును పెరుమాండ్లు చంపాడని.. తన తమ్ముడిపై ప్రజల్లో ఉన్న మంచితనం చూడలేక అన్న నర్సప్పనే చంపించాడన్న అనుమానాలు తలెత్తుతాయి. అలా అటు పెరుమాండ్లు, నర్సప్ప వర్గాలు రెండూ కొట్టుకుంటూ హింసాత్మక వాతావరణం నెలకొంటుంది. దీంతో అక్కడి పరిస్థితులను చక్కబెట్టడానికి.. ఆ కేసును చేధించే పనిని ఐపీఎస్ కల్కీ (రాజశేఖర్) ను పంపిస్తారు. కొల్లాపూర్‌ వచ్చిన కల్కి, జర్నలిస్ట్ దేవదత్తా (రాహుల్ రామకృష్ణ) సాయంతో ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెడతాడు. కల్కి ఈ కేసు ఎలా చేదించాడు..? అసలు శేఖర్‌ బాబు ఎలా చనిపోయాడు.? ఎవరు చంపారు..? అన్నదే మిగతా కథ

విశ్లేషణ: ‘గరుడవేగ’ లాంటి సినిమాతో హిట్ కొట్టిన రాజశేఖర్, ‘అ’ సినిమా లాంటి ఓ వైవిధ్య భరితమైన సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ సినిమా కాబట్టి అంచనాలు ఉండటం సహజమే. ఇక పీరియాడిక్ థ్రిల్లర్ డ్రామా గా తెరకెక్కిన సినిమా కాబట్టి ప్రేక్షకుడు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కోసమే సినిమాకు వస్తాడు. ఈ సినిమాలో కూడా అలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగానే పెట్టాడు ప్రశాంత్ వర్మ. రెండో ప్రయత్నంగా పీరియాడికల్‌ థ్రిల్లర్‌ను ఎంచుకున్న ప్రశాంత్ సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి. డిఫరెంట్ స్క్రీన్‌ప్లే, థ్రిల్లింగ్‌ ట్విస్ట్‌లతో మంచి కథా కథనాలను రెడీ చేసుకున్నాడు.

అయితే ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు వస్తూనే ఉంటాయి.. కానీ ఆస‌క్తి, ఉత్కంఠ‌ని రేకెత్తిస్తూ సాగే చిత్రాలే ఆద‌ర‌ణ పొందుతుంటాయి. ఆ విషయంలో ‘క‌ల్కి’ ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బావుండేది అనిపిస్తుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ విషయంలో ప్రశాంత్ వర్మ కేరు తీసుకుంటే సినిమా వేరే రేంజ్ లో ఉండేది. కానీ ద్వితీయార్థంలో థ్రిల్లింగ్‌ ట్విస్ట్‌లతో ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేశాడు దర్శకుడు. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు ఆడియన్స్‌ను కట్టిపడేశాడు.

ఇక గరుడ వేగ సక్సెస్‌తో మంచి ఊపు మీదున్న రాజశేఖర్‌, కల్కి పాత్రలో జీవించాడు. పోలీస్ పాత్రలు రాజశేఖర్ కు కొట్టినపిండే కాబట్టి అవలీలగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. మరోసారి యాంగ్రీ హీరోగా సూపర్బ్‌ అనిపించాడు. యాక్షన్‌ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ గా చేసిన అదా శర్మది చిన్న పాత్రే అని చెప్పొచ్చు. కీలక పాత్రలో నటించిన నందితా శ్వేత.. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. మంచి నటిగా పేరున్న నందితా కూడా ఈ సినిమాతో మరోసారి తన మీదున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంది.. సినిమాను నడిపించే పాత్రలో రాహుల్ రామకృష్ణ ఆకట్టుకున్నాడు. సీరియస్‌ మోడ్‌లో సాగే కథనంలో అప్పుడప్పుడు తనదైన కామిక్‌ టైమింగ్‌తో మెప్పించాడు. విలన్‌గా అశుతోష్‌ రాణా తన పాత్రలో ఒదిగిపోయాడు. ఇతర పాత్రల్లో శత్రు, నాజర్‌, సిద్దు జొన్నలగడ్డ, చరణ్‌దీప్‌, పూజితా పొన్నాడ తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతికంగా సినిమా ఫర్వాలేద‌నిపిస్తుంది. దాశ‌ర‌థి శివేంద్ర కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. సంగీత ద‌ర్శకుడు శరవణన్‌ భ‌ర‌ద్వాజ్ అంతగా ప్రభావం చూపించ‌లేక‌పోయారు. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే వన్ టైమ్ వాచ్ బుల్ సినిమా అని చెప్పొచ్చు. ఎక్కువ అంచనాలు లేకుండా వెళ్లటమే బెటర్..

ప్లస్ పాయింట్స్
స్టోరీ లైన్
రాజశేఖర్
ఆఖరి 30 నిమిషాలు

మైనస్ పాయింట్స్
కథనం
స్క్రీన్ ప్లే

[subscribe]

[youtube_video videoid= udNKzzz4vDk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =