ర‌జినీ ద‌ర్శ‌కుడితో రానా?

#RanaDaggubati, Hero Rana Daggubati Upcoming Movie News, Latest Telugu Movies News, Rana Daggubati Latest News, Rana Daggubati Next Film Updates, Rana Daggubati Next Film With Rajinikanth Director, Rana Daggubati To Work With Rajinikanth Director, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
పాన్ – ఇండియా యాక్ట‌ర్‌గా పేరుతెచ్చుకున్న రానా… ప్ర‌స్తుతం ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. ఒక‌వైపు సోలో హీరోగా న‌టిస్తూనే… మ‌రో వైపు మ‌ల్టీస్టార‌ర్ మూవీస్‌లోనూ సంద‌డి చేస్తున్నాడు ఈ టాలెంటెడ్ స్టార్‌. ప్ర‌స్తుతం బాలీవుడ్ మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ `హౌస్‌ఫుల్ 4` (అక్ష‌య్ కుమార్), `భుజ్‌: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా` (అజ‌య్ దేవ‌గ‌ణ్‌)లో న‌టిస్తున్న రానా… తాజాగా మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడని టాక్‌. ఆ వివ‌రాల్లోకి వెళితే… సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌తో `క‌బాలి`, `కాలా` చిత్రాల‌ను రూపొందించిన పా.రంజిత్… ప్ర‌స్తుతం స్వాతంత్య్ర పోరాటయోధుడు బిర్సా ముండా జీవితం ఆధారంగా ఓ హిందీ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడు. మ‌ల్టీస్టార‌ర్ మూవీగా రూపొంద‌నున్న ఈ సినిమాలో రానా ఓ కీల‌క పాత్ర పోషిస్తాడ‌ని టాక్‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళ‌నుందట‌. త్వ‌ర‌లోనే రానా, రంజిత్ కాంబినేష‌న్ మూవీపై క్లారిటీ వచ్చే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid= 1Q_i14g_2T0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.