గత కొంతకాలంగా కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో సినీ పరిశ్రమ మరో ఆణిముత్యాన్ని కోల్పొయిందని ఇప్పటికే పలువురు సినీ-రాజకీయ సెలబ్రిటీలు సంతాపం తెలిపారు. ఆమె పార్థీవ దేహాన్ని దర్శించడానికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా కదలివచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజయ నిర్మల భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. నానక్‌రామ్‌గూడలోని కృష్ణా నివాసానికి వెళ్లి.. విజయ నిర్మల భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. భార్య మృతితో కన్నీరు మున్నీరు అవుతున్న కృష్ణను చాలా సేపు ఆయన పక్కనే ఉండి కేసీఆర్ ఓదార్చారు. కేసీఆర్ తో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు కే కేశవరావు, సంతోష్‌కుమార్, రంజిత్‌రెడ్డి విజయ నిర్మల పార్ధీవదేహానికి నివాళులర్పించారు.
ఇక సినీ ఇండస్ట్రీ నుండి అయితే పాత తరం.. కొత్త తరం అందరూ కదలివచ్చారు. జమున, గీతాంజలి, కైకాల సత్యనారాయణ, కోటా శ్రీనివాసరావు, మురళీమోహన్, చిరంజీవి, మోహన్ బాబు, విజయశాంతి, పవన్ కళ్యాణ్, రాజేశేఖర్, జీవిత, లక్ష్మీ ప్రసన్న అంతేకాదు ప్రముఖ దర్శక నిర్మాతలు విజయ నిర్మల భౌతిక కాయాన్ని దర్శించుకొని ఘన నివాళులు అర్పించారు.
[subscribe]
[youtube_video videoid=L1dTlX0bsh8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























