
ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 61


`సైరా` రిలీజ్ డేట్ చెప్పేసిన చిరు
జయలలిత బయోపిక్ తలైవి లో MGR
మూడు నిమిషాల్లో సింగిల్ టేక్..!

హిలేరియస్‌గా మహేష్ ట్రైన్ జర్నీ

భారీ బడ్జెట్ మూవీ రామాయణ లో సీత ?
మరో సారి వాయిదా పడ్డ `బందో బస్త్`
శ్రద్ధా కపూర్ డబుల్ ధమాకా

మీడియా కు సుజిత్ కౌంటర్ - ప్రూవ్ చేసి మాట్లాడండి
ఆర్టికల్ 15 రీమేక్ లో?

సొంత కుంపటినే నమ్ముకుంటున్న మన హీరోలు
ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల కన్నుమూత

పివిపి సినిమా బ్యానర్ పై "సిండికేట్ "

గుణ 369 మూవీ మౌత్ టాక్

శివరంజని మూవీ మౌత్ టాక్

రాక్షసుడు మూవీ మౌత్ టాక్

`లాయర్ సాబ్`గా బాలకృష్ణ?
బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన `పింక్` (అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రధారులు) చిత్రాన్ని... తమిళంలో `నేర్‌కొండ పార్‌వై` పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అజిత్, విద్యా బాలన్, శ్రద్ధా శ్రీనాథ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా... ఈ కోర్ట్ డ్రామాని తెలుగులోనూ రీమేక్ చేయబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్‌లో నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తాడని ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. అంతేకాదు... తెలుగు వెర్షన్‌ని ప్రముఖ నిర్మాత `దిల్` రాజుతో పాటు బాలీవుడ్…

`సైరా` రిలీజ్ డేట్ చెప్పేసిన చిరు
మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ `సైరా నరసింహారెడ్డి`. తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని చిరు తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించగా... సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, జగపతిబాబు, సుదీప్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్... ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

గుణ 369, రాక్షసుడు మూవీ కలెక్షన్స్
ఒకపక్క బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మరో పక్క కార్తికేయ.. ఇద్దరికీ హిట్ చాలా అవసరం. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో వీరిద్దరి సినిమాలు గుణ 369, రాక్షసుడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండుకు సినిమాలకు మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా సాయి కి మొదటిసారి ఓ మంచి హిట్ దక్కింది. మరి ఈ రెండు సినిమాలా వైజాగ్ కలెక్షన్స్ ఎలా వున్నాయి.. ఏయే ఏరియా లో ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం.
జయలలిత బయోపిక్ తలైవి లో MGR
దైవ తిరుమగళ్, మదరాసు పట్టినం వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు AL విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ మూవీ తలైవి రూపొందనున్న విషయం తెలిసిందే. పురుషాధిక్య ప్రపంచంలో ఆటుపోట్లను తట్టుకుని ఒక మహిళ సక్సెస్ ఫుల్ లీడర్ గా ఎదగడం ఈ చిత్ర కథ. విబ్రి మీడియా బ్యానర్ పై విష్ణు ఇందూరి నిర్మాణ సారథ్యం లో తమిళ, హిందీ భాషలలో రూపొందనున్న తలైవి మూవీ లో జయలలిత పాత్ర లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తున్నారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి GV ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.
మూడు నిమిషాల్లో సింగిల్ టేక్..!
ఈ మధ్య సినిమా తీయడం అంటే చాలా ఈజీ అయిపోయింది. అయితే సినిమా తీయడం కాదు.. అందులో ఏం స్పెషలిటీస్ ఉంటే ప్రేక్షకులను ఎలా అట్ట్రాక్ట్ చేయొచ్చు అన్నది చూసుకుంటున్నారు. ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేయడానికి అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి ప్రయోగమే చేయానికి రెడీ అయ్యాడు యంగ్ హీరో నాగశౌర్య.

హిలేరియస్‌గా మహేష్ ట్రైన్ జర్నీ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'సరిలేరు నీకెవ్వరూ' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవల కాశ్మీర్‌లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజాగా సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. ఈ విషయాన్ని అనీల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ మహేష్ ఫోటోని కూడా షేర్ చేశాడు.

భారీ బడ్జెట్ మూవీ రామాయణ లో సీత ?
టాప్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా నిర్మాణ సారథ్యం లో నితీష్ తివారీ, రవి ఉడయార్ దర్శకత్వంలో 1500 కోట్ల భారీ బడ్జెట్ తో మైథలాజికల్ మూవీ రామాయణ మూడు భాగాలుగా రూపొందనున్న విషయం తెలిసిందే. రామాయణ మూవీ లో రాముడిగా హృతిక్ రోషన్ ఎంపికయ్యారు. సీత క్యారెక్టర్ కై స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనే యాప్ట్ అని చిత్ర నిర్మాతలు దీపిక తో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.రామాయణ మూవీ ఫస్ట్ పార్ట్ 2021 సంవత్సరంలో రిలీజ్ కానుంది.
మరో సారి వాయిదా పడ్డ `బందో బస్త్`
`వీడొక్కడే`, `బ్రదర్స్` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత కోలీవుడ్ స్టార్ సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ కేవీ ఆనంద్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా `బందో బస్త్`. తమిళంలో `కాప్పాన్` పేరుతో రూపొందిన ఈ అనువాద చిత్రంలో మలయాళ నటుడు మోహన్‌లాల్‌తో పాటు ఆర్య, సాయేషా సైగల్, బొమన్ ఇరాని కీలక పాత్రల్లో నటించారు. హేరిస్ జైరాజ్ సంగీతమందించిన ఈ సినిమాని తొలుత ఆగస్టు 15న విడుదల చేయాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆగస్టు 30కి వాయిదా వేశారు. కాగా... లేటెస్ట్ ఇన్‌ఫర్మేషన్ ప్రకారం ఈ సినిమాని మరో మూడు వారాల పాటు వాయిదా వేశారని తెలిసింది. అంటే... సెప్టెంబర్ 20కి ఈ సినిమా…

`గ్యాంగ్ లీడర్`లోనూ కొనసాగిస్తున్న విక్రమ్ కె.కుమార్
ఒక్కో దర్శకుడికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. అలా... `మనం` దర్శకుడు విక్రమ్ కుమార్‌కి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. అదేమిటంటే... తన చిత్రాల్లో కథానాయికల పాత్రలకు `ప్రియ` అనే స్క్రీన్ నేమ్ పెట్టడం. `13 బి`తో మొదలుకుని తాజా చిత్రం `గ్యాంగ్ లీడర్` వరకు జయాపజయాలతో సంబంధం లేకుండా ఆ పేరుని ఎంతో `ప్రియం`గా కొనసాగిస్తున్నాడు విక్రమ్.
శ్రద్ధా కపూర్ డబుల్ ధమాకా
`ఆషిఖీ 2`తో భారతీయ కుర్రకారుని ఫిదా చేసింది బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. ఆపై పలు చిత్రాల్లో తన అభినయంతో అలరించిన ఈ ఉత్తరాది సోయగం... వారం రోజుల గ్యాప్‌లో రెండు ఆసక్తికరమైన చిత్రాలతో పలకరించబోతోంది. ఆ సినిమాలే... `సాహో`, `ఛిచోరే`. మల్టీలింగ్వల్ మూవీగా తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `సాహో` ఆగస్టు 30న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుండగా... రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన హిందీ చిత్రం `ఛిచోరే` సెప్టెంబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. మరి... ఒకదానితో ఒకటి పొంతన లేని పాత్రల్లో శ్రద్ధ కనిపించనున్న ఈ రెండు…

మీడియా కు సుజిత్ కౌంటర్ - ప్రూవ్ చేసి మాట్లాడండి
సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ అండ్ భారీ యాక్షన్ సినిమా సాహో. ఇంకా నెలరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నా.. ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అప్పుడే మొదలుపెట్టేశారు. ఇక నాలుగు భాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి నేషనల్ వైడ్ గా టూర్ ని కూడా ప్లాన్ చేశారు చిత్రయూనిట్.
ఆర్టికల్ 15 రీమేక్ లో?
బాలీవుడ్ డైరెక్టర్ అనుభవ్ సిన్హా దర్శకత్వంలో ‘ఆర్టికల్ 15’ ఇటీవల రిలీజై విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. విమర్శలే కాదు ఈ సినిమాపై వివాదాలు కూడా వచ్చాయి. మరి తెలుగు సినిమాలు హిందీలో, హిందీ సినిమాలను తెలుగులో రీమేక్ అవ్వడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఈ మూవీ ని కూడా తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

సొంత కుంపటినే నమ్ముకుంటున్న మన హీరోలు
ఒకప్పుడు డైరెక్టర్ సినిమా డైరెక్ట్ చేసేవాడు, హీరో నటించేవాడు, ప్రొడ్యూసర్ సినిమాని నిర్మించేవాడు. అయితే అప్పుడప్పుడు హీరోహీరోయిన్లు మెగా ఫోన్ పట్టుకునేవాళ్ళు. తమ సినిమాలు తాము నిర్మించుకునేవాళ్ళు. కానీ ఆ సంప్రదాయం తక్కువగానే ఉండేది. అప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి సినీ పరిశ్రమలో. ఇప్పుడున్న యంగ్ హీరోలు మాత్రం ఒకటి రెండు సినిమాలకే సొంత ప్రొడక్షన్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు. కొంతమంది హీరో లు తమ సినిమాలు తామే నిర్మించుకుంటున్నారు. సినిమా హిట్ అయిందంటే హీరోలకి కాసుల వర్షమే. మరి అలా మన యంగ్ హీరోలు ఎవరు తమ ప్రొడక్షన్ ఏర్పాటు చేసుకుంటున్నారో చూద్దాం.

కాంటెంపరరీ ఇష్యూ మీద తీసిన కంటెంట్ వెయిట్ ఉన్న సినిమా గుణ 369
ఇక టెక్నికల్ గా, మేకింగ్ స్టాండర్డ్స్ పరంగా కథను ప్రజెంట్ చేయటానికి అవసరమైన రీజనబుల్ మేకింగ్ స్టాండర్డ్స్ కనిపిస్తాయి. నూతన నిర్మాతలు అనిల్, తిరుమల్ రెడ్డి, శ్రీమతి ప్రవీణ కడియాలతో పాటూ , డెబ్యూ డైరెక్టర్ అర్జున్ జంధ్యాలకు "గుణ 369" గుడ్ బిగినింగ్ అవుతుందనటంలో సందేహం లేదు.
ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల కన్నుమూత
ఇప్పటివరకూ ఎంతోమంది సినీ ప్రముఖులను కోల్పోయిన తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు మరో ప్రముఖ వ్యక్తిని కోల్పోయింది. ఆయన ఎవరో కాదు ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన తుదిశ్వాస విడిచారు. తన సతీమణి లక్ష్మీ కనకాల మృతి తరువాత మానసికంగా ఆయన చాలా దెబ్బతిన్నారు.

పివిపి సినిమా బ్యానర్ పై "సిండికేట్ "
విలేజ్ లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ నిర్మించిన మహి V రాఘవ్ పాఠశాల మూవీ తో దర్శకుడిగా మారారు. మహి V రాఘవ్ దర్శకత్వంలో రూపొందిన ఆనందో బ్రహ్మ, యాత్ర వంటి మూవీస్ విజయం సాధించాయి. ఇప్పుడు పివిపి సినిమా వంటి పెద్ద బ్యానర్ లో సిండికేట్ మూవీ రూపొందించనున్నారు.

రాక్షసుడు తెలుగు మూవీ రివ్యూ - ఎంగేజింగ్ సస్పెన్స్ థ్రిల్లర్
అక్కడక్కడా స్లోగా సాగే కొన్ని సన్నివేశాలు

గుణ 369 మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

శివరంజని మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

రాక్షసుడు మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.