రాక్ష‌సుడు తెలుగు మూవీ రివ్యూ – ఎంగేజింగ్ సస్పెన్స్ థ్రిల్లర్

Rakshasudu Movie Review,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Latest Telugu Movie Reviews,2019 Telugu New Movie Reviews,Rakshasudu Review,Rakshasudu Telugu Movie Review,Rakshasudu Movie Story,Rakshasudu Telugu Movie Live Updates,Rakshasudu Movie Public Talk,Rakshasudu Telugu Movie Public Response,Rakshasudu Movie Rating,Rakshasudu Telugu Movie Review And Rating,Rakshasudu Movie Mouth Talk

బడా ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడిగా తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు సాయి శ్రీనివాస్. హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఒకటి రెండు సినిమాలు కమర్షియల్ గా ఓకే అనిపించినా సరైన హిట్ మాత్రం అందుకోలేక పోయాడు.ఈ ఏడాది ‘సీత’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆడియన్స్ ని నిరాశ పరిచాడు. అయితే ఇప్పుడు ‘రాక్షసుడు’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో సూపర్ హిట్ అయితే ‘రాచ్చసన్’ సినిమాను ‘రాక్షసుడు’ పేరుతో రీమేక్ చేశారు. రమేష్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ పక్కన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. మరి ఈ సినిమా ఈరోజు రిలీజ్ ఇది. ఈ సినిమాతో అయినా సాయి కి మంచి బ్రేక్ ఇచ్చిందో లేదో తెలియాలంటే రివ్యూ లో కి వెళ్ళాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , అనుపమ పరమేశ్వరన్ , శరవణన్
దర్శకత్వం : రమేష్ వర్మ
సంగీతం : జిబ్రాన్
నిర్మాత : కోనేరు సత్యనారాయణ

కథ:
అరుణ్ కుమార్ ( బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ) కు మొదటినుండి డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్. సైకో థ్రిల్లర్ టైపు లో మూవీ తీయాలనుకొని అలా తన ప్రయత్నాలు తాను చేస్తుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల పోలీస్ ఉద్యోగం లో జాయిన్ అవుతాడు. అయితే అదే సమయంలో వరుసగా కిడ్నాప్ లు, హత్యలు జరుగుతుంటాయి. వాటిని పరిశోధించే క్రమంలో కృష్ణవేణి ( అనుపమ పరమేశ్వరన్) సహాయపడుతుంది. అసలు టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంది ఎవరు ? ఎందుకు చేస్తున్నారు? హత్యల వెనకాల ఉన్న మర్మం ఏంటి ? సాయి ఆ మిస్టరీ ఎలా ఛేదించాడు?అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సాయి శ్రీనివాస్ కి ఈ సినిమా మంచి ఊరటనిచ్చిందనే చెప్పొచ్చు. గత సినిమాలతో పోలిస్తే బెల్లంకొండ ఈ సినిమాతో ఆకట్టుకున్నాడట. నటనకు ఎక్కువ ప్రాధాన్యత వున్న సినిమా కావడంతో సాయి కి తన నటనను ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కింది. చాలా సెటిల్డ్ గా అద్భుతంగా నటించాడు. మొత్తానికి బెల్లంకొండ శ్రీనివాస్‌కు చాలా రోజుల తరవాత ఒక హిట్ పడింది. టీచర్ గా చేసిన అనుపమకు అంత ప్రాధాన్యత లేకపోయినా వున్నంతవరకు అభినయంతో ఆకట్టుకుంది. ఇద్దరి జోడీ కూడా బాగుంది. ఇక సైకో గా నటించిన తమిళ నటుడు శరవణన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. నిజమైన సైకో ని తలపించాడు అదే స్థాయిలో భయపెట్టాడు కూడా. ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమ పాత్ర మేర నటించారు.

సినిమాకు ప్రధాన బలం స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. దర్శకుడు రమేష్ వర్మ చాలా బాగా రీమేక్ చేసాడు. మంచి స్క్రీన్ ప్లే రాసుకోవడం తో ఆడియన్స్ కి ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంగేజ్ చేయగలిగాడు. థ్రిల్లింగ్ కథనంతో ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసాడు.

ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో జిబ్రాన్ కు ఫుల్ మార్క్స్ పడ్డాయి. జిబ్రాన్ అందించిన నేపధ్య సంగీతం సినిమాకు మరో బలం. విజువల్స్ బాగున్నాయి. ఇక నిర్మాణ విలువలు సైతం అద్భుతంగా ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే ఎంగేజింగ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా చూడాల్సిన సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు..

ప్లస్ పాయింట్స్:

నటీనటులు
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్

అక్కడక్కడా స్లోగా సాగే కొన్ని సన్నివేశాలు

 

రాక్ష‌సుడు తెలుగు మూవీ రివ్యూ
  • Story
  • Screenplay
  • Direction
  • Performance
3.3
Sending
User Review
0 (0 votes)

 

[subscribe]

[youtube_video videoid=d42sa1Du_j4]

Summary
Review Date
Reviewed Item
రాక్ష‌సుడు తెలుగు మూవీ రివ్యూ
Author Rating
41star1star1star1stargray

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + twelve =