అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరూ’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవల కాశ్మీర్‌లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజాగా సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. ఈ విషయాన్ని అనీల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ మహేష్ ఫోటోని కూడా షేర్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైన్ డోర్ దగ్గర మహేష్ నిలుచున్న ఫోటోని షేర్ చేస్తూ… రెండో షెడ్యూల్ శరవేగంగా జరుపుకుంటుంది.. హిలేరియస్‌గా సాగే ట్రైన్ జర్నీ వచ్చే సంక్రాంతికి థియేటర్‌లో రానుంది…. మహేష్ ఎంటర్‌టైన్ కోసం ఆసక్తిగా ఎదురు చూడండని కామెంట్ పెట్టాడు అనీల్. అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ గా మహేష్ చేస్తున్న తరుణంలో ఆయన బోర్డర్ నుండి ఇంటికి వచ్చే క్రమంలో హీరోయిన్ రశ్మికకు, మహేష్ కి మధ్య రొమాంటిక్ కామెడీ ని దర్శకుడు అనిల్ ఈ ట్రైన్ ఎపిసోడ్ లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
Second schedule progressing in full swing. A hilarious train ride awaits you in theaters this Sankranthi. Get ready to be entertained by Super Star @urstrulymahesh garu… 💥💥💥 #SarileruNekkevvaru pic.twitter.com/pyuClMo0LN
— Anil Ravipudi (@AnilRavipudi) August 3, 2019
కాగా ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
[youtube_video videoid=zCzNEtv7DzE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: