దైవ తిరుమగళ్, మదరాసు పట్టినం వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు AL విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ మూవీ తలైవి రూపొందనున్న విషయం తెలిసిందే. పురుషాధిక్య ప్రపంచంలో ఆటుపోట్లను తట్టుకుని ఒక మహిళ సక్సెస్ ఫుల్ లీడర్ గా ఎదగడం ఈ చిత్ర కథ. విబ్రి మీడియా బ్యానర్ పై విష్ణు ఇందూరి నిర్మాణ సారథ్యం లో తమిళ, హిందీ భాషలలో
రూపొందనున్న తలైవి మూవీ లో జయలలిత పాత్ర లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తున్నారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి GV ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జయలలిత పొలిటికల్ కెరీర్ లో ముఖ్య పాత్ర పోషించిన దివంగత లెజండరీ యాక్టర్, తమిళనాడు ముఖ్య మంత్రి MGR పాత్రకు బ్లాక్ బస్టర్ మూవీ దళపతి తో సినీకెరీర్ ప్రారంభించి, అనేక సూపర్ హిట్ మూవీస్ లో నటించిన అరవింద్ స్వామి ఎంపికయ్యారు. జగపతి బాబు, జయసుధ, సత్యరాజ్ ముఖ్య పాత్రలలో నటించనున్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న తలైవి మూవీ లో జయలలితగా నటిస్తున్న కంగన తమిళ భాష ను నేర్చుకొనడం విశేషం. తలైవి మూవీ ఒక పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనుందని దర్శకుడు AL విజయ్
తెలిపారు.
[youtube_video videoid=OWBRN_wbsI8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























