మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ `సైరా నరసింహారెడ్డి`. తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని చిరు తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించగా… సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, జగపతిబాబు, సుదీప్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్… ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… `సైరా` విడుదల తేదిపై గత కొంతకాలంగా రకరకాల కథనాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటికి చెక్ పెడుతూ… తాజాగా చిరు విడుదల తేదిని కన్‌ఫర్మ్ చేశారు. ఓ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా… మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. మరి… వెరీ వెరీ స్పెషల్ డేన వస్తున్న ఈ పేట్రియాట్రిక్ డ్రామా టాలీవుడ్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలచిపోయే ఫలితాన్ని అందుకోవాలని ఆశిద్దాం.
[youtube_video videoid=uiqL3xbQuTs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























