ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 45

`చదరంగం` ఆడుతున్న నితిన్?

నాగార్జున ‘అల్లరి అల్లుడు’కు 26 ఏళ్ళు
నిశ్శబ్ధం మూవీ అప్ డేట్ కై ట్వీట్స్
సూపర్ హిట్ మూవీ ధృవ సీక్వెల్ ధృవ 2 ?
బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా మూవీ ప్రారంభం
ట్రెండ్ సెట్టింగ్ మూవీ ‘శివ’కు 30 ఏళ్ళు
`సరిలేరు నీకెవ్వరు`... 70 శాతం చిత్రీకరణ పూర్తి
దర్బార్ మూవీ షూటింగ్ పార్ట్ పూర్తి
ప్రముఖ నటుడు దామరాజు ఇక లేరు
నాగార్జున `నిన్నే పెళ్ళాడతా`కు 23 ఏళ్ళు
పండగలను టార్గెట్ చేసిన థమన్
చాణక్య మూవీ సీక్వెల్ ?
చాణక్య మూవీ సెన్సార్ పూర్తి
యన్.బి.కె 105... విడుదల తేదీ ఖరారు
`జై సింహా` తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో మరో యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో... పోలీస్ ఆఫీసర్‌గానూ, గ్యాంగ్‌స్టర్‌గానూ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాలయ్య కనిపించనున్నట్టు సమాచారం. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో భూమికా చావ్లా, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

`చదరంగం` ఆడుతున్న నితిన్?
యువ కథానాయకుడు నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్‌లో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకి ‘చదరంగం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్. ఈ చిత్రంలో నితిన్ చెస్ ప్లేయర్ గా దర్శనమివ్వనున్నాడట. అందుకే ‘చదరంగం’ అనే టైటిల్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. త్వరలోనే ఈ టైటిల్‌కు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

నాగార్జున ‘అల్లరి అల్లుడు’కు 26 ఏళ్ళు
‘కింగ్’ నాగార్జునకి కలిసొచ్చిన దర్శకుల్లో ఎ.కోదండరామిరెడ్డి ఒకరు. ఈ ఇద్దరి కలయికలో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వాటిలో ‘అల్లరి అల్లుడు’ ఒకటి. నాగార్జున సరసన నగ్మా, మీనా కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో అలనాటి మేటి నటి వాణిశ్రీ కీలక పాత్ర పోషించారు. రావుగోపాలరావు, కోట శ్రీనివాసరావు, మురళీమోహన్, చలపతిరావు, బ్రహ్మానందం, బాబూమోహన్, సంగీత తదితరులు ఇతర పాత్రల్లో నటించగా... రమ్యకృష్ణ ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.

‘వెంకీమామ’ కోసం వెంకీ, చైతూ అదరగొట్టే స్టెప్పులు
విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను కె.ఎస్.రవీంద్ర (బాబీ) తెరకెక్కిస్తున్నాడు.
నిశ్శబ్ధం మూవీ అప్ డేట్ కై ట్వీట్స్
స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై రూపొందిన నిశ్శబ్ధం మూవీ పూర్తిగా US లో షూటింగ్ జరుపుకుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల, మైకేల్ మ్యాడ్సన్ ముఖ్య పాత్రలలో నటించారు. నిశ్శబ్ధం మూవీ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది. తెలుగు లో నిశ్శబ్దం, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ కానుంది.
సూపర్ హిట్ మూవీ ధృవ సీక్వెల్ ధృవ 2 ?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ధృవ మూవీ 2016 సంవత్సరంలో రిలీజయి ఘనవిజయం సాధించింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ధృవ మూవీ లో తమిళ హీరో అరవింద్ స్వామి ప్రతినాయకుడిగా నటించడం విశేషం. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ తని ఒరువన్ కు అధికారిక తెలుగు రీమేక్ ధృవ మూవీ.
బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా మూవీ ప్రారంభం
శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తడాఖా, అల్లుడు శీను, రభస వంటి మూవీస్ కు నిర్మాత, సహనిర్మాత గా వ్యవహరించిన గణేష్ బాబు టాలీవుడ్ కు హీరోగా పరిచయం అవుతున్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండవ తనయుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోదరుడు గణేష్ బాబు హీరోగా రూపొందనున్న మూవీ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో లో ప్రారంభమయింది.
కృష్ణ, శోభన్ బాబు మల్టీస్టారర్ ‘మండేగుండెలు’కు 40 ఏళ్ళు
సూపర్ స్టార్ కృష్ణ, నట భూషణ్ శోభన్‌బాబు కాంబినేషన్‌లో పలు మల్టీస్టారర్ మూవీస్ తెరకెక్కాయి. వాటిలో ‘మండేగుండెలు’ ఒకటి. కె.బాపయ్య దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో జయప్రద, జయసుధ కథానాయికలుగా నటించారు. చంద్రమోహన్, మాధవి, గుమ్మడి వెంకటేశ్వరరావు, ప్రభాకరరెడ్డి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, అంజలీదేవి తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు. ఈ చిత్రానికి గుహనాథన్ కథను అందించగా... “హాస్యబ్రహ్మ” జంధ్యాల సంభాషణలు సమకూర్చారు.
ట్రెండ్ సెట్టింగ్ మూవీ ‘శివ’కు 30 ఏళ్ళు
తెలగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది దర్శకులు వస్తుంటారు, పోతుంటారు. అయితే, కొందరు మాత్రమే సరికొత్త ట్రెండ్‌ని సెట్ చేస్తుంటారు. అలాంటి అరుదైన దర్శకుల్లో `ఎవర్‌గ్రీన్ సెన్సేషన్` రామ్‌గోపాల్ వర్మ ఒకరు. దర్శకుడిగా వేసిన తొలి అడుగుతోనే ప్రభంజనం సృష్టించిన వైనం తన సొంతం. అలా... ఓ ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్‌కి బీజం వేసిన ఆ ట్రెండ్ సెట్టింగ్ మూవీనే... ‘శివ’. ఈ సినిమాకు సంబంధించి స్టోరీ, స్క్రీన్‌ప్లే, మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ప్రచార చిత్రాలు, పోస్టర్లు... ఇలా ప్రతీదీ చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేసి భావితరం దర్శకులకు స్ఫూర్తిప్రదాతగా…
`సరిలేరు నీకెవ్వరు`... 70 శాతం చిత్రీకరణ పూర్తి
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ సినిమాని అనిల్ సుంకర, ‘దిల్’ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ శక్తిమంతమైన పాత్రలో దర్శనమివ్వనున్నారు. రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిషోర్, బ్రహ్మానందం, సంగీత ముఖ్య భూమికలు పోషిస్తున్నారు.
మ్యాంగో మ్యూజిక్ ద్వారా తూటా మూవీ సాంగ్ రిలీజ్
ఘర్షణ, ఏ మాయ చేసావె, ఎటో వెళ్ళి పోయింది మనసు, సాహసం శ్వాసగా సాగిపో వంటి సూపర్ హిట్ మూవీస్ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్, మేఘ ఆకాష్ జంటగా తూటా మూవీ రూపొందింది. ఎన్నై నోకి పాయుమ్ తోటా తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ తూటా మూవీ. శశికుమార్, సునైనా ముఖ్యపాత్రలలో నటించారు దర్భుక శివ సంగీతం అందించారు.
దర్బార్ మూవీ షూటింగ్ పార్ట్ పూర్తి
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై AR మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ముంబై మాఫియా నేపథ్యం లో దర్బార్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో రజనీకాంత్ సుమారు 25 సంవత్సరాల తరువాత పోలీస్ ఆఫీసర్ గా నటించడం విశేషం. లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయిక కాగా, బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. నివేత థామస్, ప్రతీక్ బబ్బర్, చెంబన్ వినోద్ జోస్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
ప్రముఖ నటుడు దామరాజు ఇక లేరు
సినీ , నాటక రంగాలలో రాణించిన ప్రముఖ నటుడు దామరాజు వెంకట లక్ష్మీ నరసింహా రావు (79) బుధవారం రాత్రి హైదరాబాద్ లో కన్ను మూశారు. ప్రముఖ దర్శకుడు, నాటక రంగ పితామహుడు చాట్ల శ్రీరాములు శిష్యుడు దామరాజును దర్శకరత్న దాసరి తాత మనవడు మూవీ తో సినీరంగానికి పరిచయం చేశారు. దామరాజు పలు చిత్రాలలో నటించారు.
నాగార్జున `నిన్నే పెళ్ళాడతా`కు 23 ఏళ్ళు
తెలుగు సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ... కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలను రూపొందించడంలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ శైలే వేరు. అలా ఆయన తెరకెక్కించిన చిత్రాలలో... బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలచింది `నిన్నే పెళ్ళాడతా`. ‘కింగ్’ నాగార్జున, టబు జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో... లక్ష్మి, చలపతిరావు, చంద్రమోహన్, కవిత, ‘ఆహుతి’ ప్రసాద్, మంజుభార్గవి, బెనర్జీ, సన, గిరిబాబు, ఉత్తేజ్, బ్రహ్మాజీ, రమాప్రభ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
పండగలను టార్గెట్ చేసిన థమన్
వరుస విజయాలతో ముందుకు సాగుతున్న యువ సంగీత దర్శకుడు థమన్... ప్రస్తుతం నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్‌కు స్వరాలు సమకూరుస్తున్నాడు. ఆ చిత్రాలే... ‘వెంకీమామ’, ‘డిస్కో రాజా’, ‘ప్రతి రోజూ పండగే’, ‘అల వైకుంఠపురములో’. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ నాలుగు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా మూడు వేర్వేరు పండుగలకి విడుదల కానున్నాయి.
చాణక్య మూవీ సీక్వెల్ ?
యాక్షన్ స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా తిరు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రుపొందిన స్పై థ్రిల్లర్ చాణక్య మూవీ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో గోపీచంద్ రా ఏజెంట్ , మెహరీన్ కథానాయిక , బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటించిన చాణక్య మూవీ స్టైలిష్ యాక్షన్ డ్రామా గారూపొందింది . ఈ మూవీ కి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.
మెగా కాంపౌండ్‌లో నాలుగో విజయం అందుకున్న స్టార్ సినిమాటోగ్రాఫర్
ఆర్. రత్నవేలు... పరిచయవాక్యాలు అక్కర్లేని టాప్ టెక్నీషియన్. తమిళ చిత్రం ‘అరవిందన్’(1997)తో సినిమాటోగ్రాఫర్‌గా అరంగేట్రం చేసిన రత్నవేలు... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ‘ఆర్య’తో(2004) టాలీవుడ్‌లో తొలి అడుగులు వేశాడు. తెలుగునాట మొదటి ప్రయత్నంలోనే మెగా హిట్ అందుకున్నాడు. అనంతరం పలు తెలుగు చిత్రాలకు పనిచేసినప్పటికీ... మెగా కాంపౌండ్ లో చేసిన సినిమాలతోనే మంచి గుర్తింపుని తెచ్చుకుంటున్నాడు రత్నవేలు.
మెగా ఫ్యామిలీ తండ్రీకొడుకుల కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న కథానాయికలు
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా... తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ఇద్దరు కథానాయికలది ప్రత్యేకమైన స్థానం. ఎందుకంటే... తెలుగునాట దాదాపు అందరు యంగ్ హీరోస్‌తోనూ ఆడిపాడి అలరించిన వైనం వీరి సొంతం. అంతేకాదు... ఒకే ఫ్యామిలీకి చెందిన తండ్రీకొడుకుల విషయంలో అటు తనయుడితోనూ, ఇటు తండ్రితోనూ రొమాన్స్ చేసి విజయాలను అందుకున్న నాయికలుగా కూడా ఓ అరుదైన ఘనతను తమ సొంతం చేసుకున్నారు ఈ టాలెంటెడ్ హీరోయిన్స్.
సురేందర్ రెడ్డికి కలిసొస్తున్న `మెగా ఫ్యామిలీ` స్టార్ హీరోస్
`అతనొక్కడే`తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన సురేందర్ రెడ్డి... తొలి అడుగులోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అనంతరం యంగ్‌టైగర్ యన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ మహారాజా రవితేజ వంటి స్టార్ హీరోలతో పనిచేసినా... మెగా హీరోలను డైరెక్ట్ చేసిన సినిమాలే సూరికి ఎనలేని గుర్తింపుని తీసుకువస్తున్నాయి. ఇక తాజాగా విడుదలైన `సైరా... నరసింహారెడ్డి`తోనైతే ఆ కాంపౌండ్ లో మూడో ఘనవిజయం అందుకున్నాడు కూడా.
చాణక్య మూవీ సెన్సార్ పూర్తి
AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తిరు సుబ్రమణ్యం దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా రూపొందిన స్పై థ్రిల్లర్ చాణక్య మూవీ 5వ తేదీ రిలీజ్ కానుంది. మెహరీన్ , జరీన్ ఖాన్ కథానాయికలు. బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ చాణక్య మూవీ తో టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు.