మ‌హాత్మ గాంధీ శ‌త‌జ‌యంతికి విడుద‌లైన ‘మనుషులు మారాలి’కి అర్ధ శ‌తాబ్దం

50 Years Completes For Manushulu Marali Telugu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Manushulu Marali Movie Updates,Manushulu Marali Telugu Movie Latest News,Manushulu Marali Movie Completes 50 Years,Manushulu Marali Telugu Movie Completed 50 Years,#ManushuluMarali

అలనాటి మేటి నటి శారదకు జాతీయస్థాయిలో `ఉత్తమ నటి`గా గుర్తింపునిచ్చిన‌ మలయాళ చిత్రం ‘తులాభారం’. పేదరికం వల్ల‌… పెంచే స్థోమత లేక కన్నపిల్లల్నే చంపుకున్న ఓ తల్లి కథే ఈ సినిమా. మ‌ల‌యాళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘మనుషులు మారాలి’ పేరుతో రీమేక్ చేశారు దర్శకుడు వి.మధుసూద‌నరావు. శోభన్‌బాబు, శారద జంటగా నటించిన ఈ సినిమాలో హరనాథ్, కాంచన, గుమ్మడి వెంకటేశ్వరరావు ముఖ్య భూమిక‌లు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దిగ్గజ స్వరకర్త కె.వి.మహదేవన్ సంగీత సార‌థ్యంలో సంద‌ర్భోచితంగా వ‌చ్చే పాటలన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. ముఖ్యంగా “మారాలి మారాలి మనుషులు మారాలి”, “పాపాయి నవ్వాలి”, “తూరుపు సిందూరపు”, “చీకటిలో కారు చీకటిలో” వంటి గీతాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ చిత్రాన్ని తమిళంలో ‘తులాభారం’ పేరుతోనూ, హిందీలో ‘సమాజ్ కో బదల్ డాలో’ టైటిల్‌తోనూ పునర్నిర్మించారు. నాలుగు వెర్ష‌న్స్‌లోనూ శారద ప్ర‌ధాన పాత్రను పోషించడం విశేషం. అంతేకాదు… ఈ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్స్‌గా పనిచేసిన కె.రాఘవేంద్రరావు, పి.సి.రెడ్డి, ఎ.కోదండరామిరెడ్డి తరువాతి కాలంలో అగ్ర దర్శకులుగా మంచి గుర్తింపు తెచ్చుకోవ‌డం మ‌రో విశేషం. జెమినీ స్టూడియోస్ నిర్మించిన ఈ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌… అప్పట్లో సిల్వర్ జూబ్లీ వేడుక‌లు జరుపుకుంది. మహాత్మా గాంధీ శతదినోత్సవ జయంతి సందర్భంగా అంటే… 1969 అక్టోబర్ 2న విడుదలైన ‘మనుషులు మారాలి’… నేటితో 50 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 11 =