ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండవ తనయుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ కి రంగం సిద్ధం అయింది. లక్ష్మీ నరసింహా, శంభో శివ శంభో, కందిరీగ, జబర్దస్త్, బస్ స్టాప్ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ నిర్మాత బెల్లంకొండ సురేష్ భారీ బడ్జెట్ తో VV వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అల్లుడు శీను మూవీ తో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ ను
టాలీవుడ్ కు హీరో గా పరిచయం చేశారు.ఇప్పుడు తన రెండవకుమారుడు నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు ను ఎంటర్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రేమ, ఇష్క్, కాదల్ మూవీ ఫేమ్ పవన్ సాధినేని దర్శకత్వంలో గణేష్ బాబు హీరోగా బెల్లంకొండ సురేష్ నిర్మాణ సారథ్యం లో రూపొందనున్న మూవీ షూటింగ్ అక్టోబర్ 5వ తేదీ అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభం కానుంది. రధాన్ సంగీతం అందిస్తున్నారు. మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వివరాలు మూవీ ప్రారంభోత్సవ రోజున వెల్లడవుతాయి. టాలీవుడ్ కు మరో కొత్త హీరో గణేష్ బాబు ఎంటరవుతున్నందుకు అతనికి ఆల్ ది బెస్ట్ చెబుదాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: