‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను మరోసారి జట్టుకట్టబోతున్న సంగతి తెలిసిందే. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది డిసెంబర్ నుంచి పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదేమిటంటే… బోయపాటి గత రెండు చిత్రాల మాదిరిగానే… ఈ సినిమాలో కూడా బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్టు సమాచారం. అంతేకాదు… వాటిలో ఒక పాత్ర కోసం ఏకంగా 25 కిలోల బరువు కూడా తగ్గనున్నారట బాలయ్య. దాని కోసం జిమ్‌లో దాదాపు ఐదు గంటల పాటు శ్రమిస్తున్న బాలయ్య… ఇప్పటికే 15 కిలోల వరకు బరువు తగ్గారని టాక్. ఈ నేపథ్యంలో… నిపుణుల సలహా మేరకు కార్బోహైడ్రేట్స్ డైట్‌ను మాత్రమే తీసుకుంటున్నట్టు వినికిడి. మరి… ఈ చిత్రంలో బాలయ్య లుక్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే 2020 వేసవి వరకు ఆగాల్సిందే.
కాగా, ప్రస్తుతం బాలకృష్ణ… కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామా… డిసెంబర్ 21న విడుదల కానున్నట్టు ప్రచారం సాగుతోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: