తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మక్కళ్ సెల్వన్ విజయ సేతుపతి కూడా అతి తక్కువ కాలంలోనే.. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ఓ రేంజ్ కు వెళ్ళాడు. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే.. వీళ్ళిద్దరిని ఒకే స్క్రీన్ పై చూస్తే ఎలా ఉంటది. ఊహించుకుంటేనే చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా.. ఈ ఊహ నిజం కాబోతున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ తన తర్వాత సినిమా చేయనున్నాడు. ఎక్స్‌బీ ఫిలింస్ క్రియేషన్స్ పతాకంపై జవీర్ బ్రింటో నిర్మించనున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారాఅద్వాని హీరోయిన్గా నటించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలోనే విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు అది కూడా విలన్ పాత్రలో నటిస్తున్నాడట. ప్రస్తుతం ఫ్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబరు తొలివారం నుంచి ఈ సంచలన చిత్రం సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా ప్రస్తుతం విజయ్ అట్లీ దర్శకత్వంలో బిగిల్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను దీపావళికి తెరపైకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏజీఎస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























