విక్టరీ వెంకటేష్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్లో తెరకెక్కిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. వాటిలో ‘సుందరకాండ’ ఒకటి. తమిళ చిత్రం ‘సుందరకాండం’కు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడిగా మీనా నటించగా… అపర్ణ కీలక పాత్ర పోషించింది. గొల్లపూడి మారుతీరావు, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, కోట శ్రీనివాసరావు, నిర్మలమ్మ ముఖ్య భూమికలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వేటూరి సుందరామమూర్తి గీత రచనకు స్వరవాణి ఎం.ఎం.కీరవాణి అందించిన బాణీలు జనాదరణ పొందాయి. “ఆకాశాన సూర్యుడుండడు” (మేల్ అండ్ ఫీమేల్ వెర్షన్స్), “ఇంకా ఇంకా”, “సుందర కాండకు”, “ఉలికిపడకు”, “కోకిలమ్మ”… ఇలా ప్రతీ పాట ప్రేక్షకులను అలరించింది. సౌదామిని క్రియేషన్స్ పతాకంపై కె.వి.వి.సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. 1992 అక్టోబర్ 2న విడుదలైన ‘సుందరకాండ’… నేటితో 27 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























