శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 23 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ‘భారతీయుడు2’ ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా నుండి అజయ్ దేవగన్ తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ సమస్యల కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో అజయ్ దేవగన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారంటున్నారు. అంతేకాదు ఆ స్థానంలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనిల్ కపూర్ ను తీసుకోనున్నారట. ఇప్పటికే శంకర్, అనిల్ కపూర్ మధ్య చర్చలు కూడా జరిగాయని, ఆయన కూడా ఈ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
కాగా ఈ సినిమాలో రకుల్ కథానాయికగా నటిస్తుండగా.. ఐశ్వర్య రాజేష్, ప్రియా భవాని శంకర్ లు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. శింబు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో నటించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాఅనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సినిమాటోగ్రఫీ రవి వర్మన్. ఇక 2021లో తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని మార్చి14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: