25 గెటప్స్ లో స్టార్ హీరో చియాన్ విక్రమ్

Chiyaan Vikram To Be Seen in 25 Different Looks,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Chiyaan Vikram Upcoming Movie News,Chiyaan Vikram Next Film Updates,Chiyaan Vikram New Movie News,Chiyaan Vikram Next Project Details,Chiyaan Vikram Ucoming Film Updates

విభిన్న పాత్రలలో ప్రయోగాత్మక చిత్రాలలో నటించే తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ దేశం గర్వించదగ్గ గొప్పనటుడు. తమిళం తో పాటు తెలుగు లో కూడా సమాన మార్కెట్ ఉన్న హీరో విక్రమ్ తాను నటించే మూవీ లో పాత్రకు తగ్గట్టుగా శరీర ఆకృతి ని మార్చుకునే ప్రతిభావంతుడు. ఇప్పుడు తన 58 వ మూవీ కి విక్రమ్ సిద్ధమవుతున్నారు. హీరో విక్రమ్ ప్రస్తుతం 300కోట్ల భారీ బడ్జెట్ తో తమిళ, మలయాళ, హిందీ భాషలలో రూపొందుతున్న మహావీర్ కర్ణ మూవీ లో కర్ణుడు గా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇమైక్క నొడిగళ్ వంటి సూపర్ హిట్ మూవీ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో సెవెన్ స్క్రీన్ స్టూడియోస్, వియాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్స్ పై స్టార్ హీరో విక్రమ్ కధానాయకుడిగా రూపొందనున్న విక్రమ్ 58 మూవీ షూటింగ్ అక్టోబర్ 4వ తేదీ ప్రారంభం కానుంది. ఈ భారీ ప్రయాగాత్మక మూవీ లో విక్రమ్ 25 గెటప్స్ లో కనిపించనున్నారని సమాచారం. ఆస్కార్ అవార్డ్ గ్రహీత AR రెహమాన్ సంగీతం అందిస్తారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − six =