కృష్ణ ‘బుర్రిపాలెం బుల్లోడు’కు 40 ఏళ్ళు

Superstar Krishna Burripalem Bullodu Completes 40 Years,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Burripalem Bullodu Completes 40 Years,40 Years for Burripalem Bullodu Movie,Krishna Burripalem Bullodu Movie

సూపర్ స్టార్ కృష్ణకి అచ్చొచ్చిన క‌థానాయిక‌ల్లో అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ఒక‌రు. అలాంటి ఈ ఇద్ద‌రు జంట‌గా న‌టించిన‌ తొలి చిత్రం ‘బుర్రిపాలెం బుల్లోడు’. బీరం మస్తాన్ రావు (ద‌ర్శ‌కుడిగా మొద‌టి సినిమా) రూపొందించిన ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ, నాగభూషణం, అల్లు రామలింగయ్య, కాంతారావు, గిరిబాబు, పి.ఎల్.నారాయణ, పండరీబాయి, ఛాయాదేవి, పుష్పకుమారి, రమోల తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. తిరుపతి ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కె.విద్యాసాగర్ నిర్మించిన ఈ సినిమాకి స‌త్యానంద్ – జంధ్యాల‌ క‌థ‌ను అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చ‌క్ర‌వ‌ర్తి స్వ‌ర‌క‌ల్ప‌న‌లో రూపొందిన పాట‌లు చిత్రానికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. వేటూరి సుందరరామమూర్తి కలం నుంచి జాలువారిన గీతాల్లో “నా జీవన బృందావనిలో”, “బుర్రిపాలెం బుల్లివాణ్ణి”, “చిన్నది కాదమ్మో”, “మాయదారి సచ్చినోళ్ళు” విశేషాద‌ర‌ణ పొందాయి. 1979 నవంబర్ 16న విడుదలైన‌ ‘బుర్రిపాలెం బుల్లోడు’… నేటితో 40 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =