ప్రముఖ నవలారచయిత కల్కీ రాసిన నవల ఆధారంగా మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ అనే సినిమా తీస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వార్తలైతే వచ్చాయి కానీ ఇంత వరకూ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. తమిళ్ లో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా ఇదే కావడంతో మణిరత్నం కూడా ఈ సినిమాలో నటించే నటీమణులను కూడా అంతే ప్రముఖులను సెలెక్ట్ చేసాడు. యువ స్టార్స్ నుంచి సూపర్‌స్టార్స్ వరకు పొన్నియన్ సెల్వన్ చిత్రంలో భాగం కాబోతున్నారు. ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకున్న ఈ చిత్రం డిసెంబర్ 12వ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో అమలా పాల్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి అమలా పాల్ తప్పుకున్నట్లు తెలుస్తుంది. పీరియాడికల్ చిత్రం కావడంతో సినిమా షూటింగ్ ప్రారంభానికి అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం పడుతుండటంతో.. ఈ సినిమా కోసం వేరే మంచి అవకాశాలు వదులుకోవడం ఇష్టం లేక ఈ సినిమా నుండి తప్పుకుందట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అమలా పాల్ క్లారిటీ ఇవ్వాల్సిందే.
ఇక ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్, అనుష్క, జయం రవి, విక్రమ్, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి, కార్తి, ఐశ్వర్య లక్ష్మి, మోహన్ బాబు లాంటి స్టార్లు నటించనున్నారు. మలయాళ నటుడు జయరాం, నటి అమలాపాల్, ఐశ్వర్యలక్ష్మి కూడా ముఖ్య పాత్రల్లో నటించనున్నట్లు తెలిసింది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: