విజయ్‌కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా ‘ఒరేయ్.. బుజ్జిగా’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కుమారి 21 ఎఫ్ ఫేమ్ హెబ్బా పటేల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు నుండి జరుగుతున్న తాజా షెడ్యూల్‌లో హెబ్బా పటేల్ యూనిట్‌తో జాయిన్ అయ్యారు. ఆమెపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
కాగా యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వాణీ విశ్వనాథ్ కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: