
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 85


`సాహో` రోజునే రానున్న సూర్య చిత్రం?

వెంకటేష్ `రాజా`కి 20 ఏళ్ళు

ఐరా మూవీ రిలీజ్ కు రెడీ

ప్రాజెక్ట్ #5 అప్ డేట్ త్వరలో

కామెడీ ఎంటర్ టైనర్ మూవీ లో గోపీచంద్

తెలుగు మూవీ లో విలన్ గా తమిళ హీరో

ఈ నెల 25 నుంచి `మన్మథుడు 2`?

బాలయ్యతో `రామారావు గారు`... ఎప్పుడంటే?

బన్నీ, త్రివిక్రమ్ సినిమా స్టోరీ లైన్ అదేనా?

డియర్ కామ్రేడ్ టీజర్ రిలీజ్

మరోసారి మనసు దోచుకున్న మహర్షి

షూటింగ్ పూర్తి చేసుకున్న బిగ్ బి

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆడియో రిలీజ్ వేదిక ఖరారు

అఫీషియల్ -సైలెన్స్ లో హాలీవుడ్ హీరో

RRR - అలియా, అజయ్ షూటింగ్ అప్ డేట్

`నువ్వు తోపురా` రిలీజ్ డేట్ ఫిక్స్

`సూర్యకాంతం`కి `తొలిప్రేమ` కనెక్షన్

అంతా ఓకే ఎలాంటి అపార్థాలు లేవు
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ పై ఇప్పుడు మంచి సస్పెన్స్ కొనసాగుతుంది. ఇటీవల టీడీపీ కి సంబంధించిన ఓ కార్యకర్త ఈసీకి ఫిర్యాదు చేయడం దానిపై స్పందించిన సీఈఓ సినిమా చూడకుండానే ఈసీకి ఆపే రైట్ లేదని అనడంతో ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కు ఉన్న ఒక అడ్డు తొలగినట్టే అనుకున్నారు. అయితే అసలైన సమస్య సెన్సార్ బోర్డ్ నుండి ఎదుర్కోవాల్సి ఉంది చిత్రయూనిట్.

లేటెస్ట్ మూవీస్ లెేటెస్ట్ కలెక్షన్స్
ఈ వారం బాక్సాఫీస్ వద్ద పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు సందడి చేయడానికి వచ్చాయి. వాటిలో కొన్ని సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోగా.. కొన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మరి ఈ వారం విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న ఈ సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

`సాహో` రోజునే రానున్న సూర్య చిత్రం?
కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి శ్రీ రాఘవ దర్శకత్వంలో నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ `ఎన్జీకే` కాగా... మరొకటి కె.వి.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `కాప్పాన్`. ఈ రెండు సినిమాలు కూడా చిత్రీకరణ తుది దశకు చేరుకున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్న `ఎన్జీకే`... ఈద్ సందర్భంగా జూన్ మొదటి వారంలో విడుదల కానుందని కోలీవుడ్ టాక్. ఇక సాయేషా హీరోయిన్‌గానూ, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, ఆర్య ఇతర ప్రధాన పాత్రల్లోనూ నటిస్తున్న `కాప్పాన్`ని ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు సమాచారం…

వెంకటేష్ `రాజా`కి 20 ఏళ్ళు
వెంకటేష్, సౌందర్య... తెలుగునాట హిట్ పెయిర్‌గా రాణించిన జోడీ. `సూపర్ పోలీస్`(1994)తో మొదలైన ఈ జంట ప్రయాణం... `దేవీ పుత్రుడు` (2001) వరకు ఏడు చిత్రాల పాటు కొనసాగింది. అయితే... వీరి కాంబినేషన్‌లో తొలి, తుది చిత్రాలు నిరాశపరిచినా... మధ్యలో వచ్చిన `ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు`, `పవిత్ర బంధం`, `పెళ్ళి చేసుకుందాం`, `రాజా`, `జయం మనదేరా` మాత్రం బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మ్రోగించాయి. ముఖ్యంగా... `రాజా` చిత్రంలో ఈ జంట అభిమానులకు కనుల పంట అయ్యింది. తమిళ చిత్రం `ఉన్నిడత్తిల్ ఎన్నై కొడుత్తేన్`కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాని సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై…

ఐరా మూవీ రిలీజ్ కు రెడీ
తెలుగు, తమిళ భాషలలో అగ్ర కథానాయిక గా వెలుగొందుతున్న లేడీ సూపర్ స్టార్ నయనతార కమర్షియల్ మూవీస్ తో పాటు, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. గంగా ఎంటర్ టైన్ మెంట్స్, KJR స్టూడియోస్ బ్యానర్స్ పై సర్జున్ దర్శకత్వంలో నయనతార ద్విపాత్రాభినయం చేసిన ఐరా మూవీ తెలుగు, తమిళ భాషలలో మార్చి 28వ తేదీ రిలీజ్ కానుంది.

విజయ్‌తో మరో సినిమా చేయనున్న టాలెంటెడ్ డైరెక్టర్
తమిళనాట ఒకప్పుడు రీమేక్‌ల స్పెషలిస్ట్ అనిపించుకున్న ఆ దర్శకుడు... ఇప్పుడు ట్రాక్ మార్చి తనే రీమేక్‌లకు సోర్స్ ఇస్తున్నాడు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు... `హనుమాన్ జంక్షన్` (2001)తో దర్శకుడిగా అవతారమెత్తిన మోహన్ రాజా. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అగ్ర నిర్మాత`ఎడిటర్` మోహన్‌కి తనయుడైన రాజా... `హనుమాన్ జంక్షన్` తరువాత తమిళ చిత్ర సీమ బాట పట్టాడు. అక్కడ `జయం`, `అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి`, `నువ్వొస్తానంటే నేనొద్దాంటానా`, `బొమ్మరిల్లు` రీమేక్‌లతో ఘనవిజయాలను అందుకున్నాడు. ఆ తరువాత ట్రాక్ తప్పడంతో... `తని ఒరువన్`తో స్ట్రయిట్ పిక్చర్ తీసి…

ప్రాజెక్ట్ #5 అప్ డేట్ త్వరలో
సినీ ఇండస్ట్రీలో వరుస హిట్లు రావడం అనేది ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది `పటాస్`, `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2` ఇలా వరుస హిట్లు కొడుతూ.. అతి తక్కువ కాలంలోనే టాప్ డైరెక్టర్ల లిస్ట్ లోకి చేరిపోయాడు అనిల్ రావిపూడి. ఇటీవల వచ్చిన ఎఫ్ 2 ఘన విజయంతో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతోనే సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

కామెడీ ఎంటర్ టైనర్ మూవీ లో గోపీచంద్
యాక్షన్ హీరో గా పేరుపొందిన గోపీచంద్ నటించిన కామెడీ ఎంటర్ టైనర్ మూవీ లౌక్యం 2014 సంవత్సరంలో రిలీజయి ఘనవిజయం సాధించి, గోపీచంద్ సినీ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది. తిరిగి ఇన్ని సంవత్సరాలకు గోపీచంద్ ఒక కామెడీ ఎంటర్ టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తెలుగు మూవీ లో విలన్ గా తమిళ హీరో
సక్సెస్ ఫుల్ తమిళ హీరో విజయ్ సేతుపతి , చిరంజీవి హీరోగా రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్ సేతుపతి మరో తెలుగు మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ను టాలీవుడ్ కు హీరోగా పరిచయం చేస్తూ ఒక మూవీ ని రూపొందిస్తున్నాయి.

ఈ నెల 25 నుంచి `మన్మథుడు 2`?
కింగ్ నాగార్జున బ్లాక్‌బస్టర్ మూవీ `మన్మథుడు` (2002)కి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. `చి ల సౌ` ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌పై నాగ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. నాగ్‌కి జోడీగా అందాల తారలు రకుల్ ప్రీత్ సింగ్, పాయల్ రాజ్‌పుత్ నాయికలుగా నటించనున్నారని సమాచారం. `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ ఛైతన్ భరద్వాజ్ సంగీతమందించనున్నాడు.

బాలయ్యతో `రామారావు గారు`... ఎప్పుడంటే?
`పటాస్`, `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2`... ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. వినోదాత్మక చిత్రాలను రూపొందించడంలో తనకు తిరుగులేదనిపించుకున్న అనిల్... ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తన తదుపరి చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. `దూకుడు` తరహాలో హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సాగనుందని సమాచారం. `మహర్షి` విడుదలయ్యాకే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ ప్రాజెక్ట్‌ని 2020 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

బన్నీ, త్రివిక్రమ్ సినిమా స్టోరీ లైన్ అదేనా?
`జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి జట్టుకడుతున్న సంగతి తెలిసిందే. `నాన్న నేను` అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నాయని సమాచారం. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. పూజా హెగ్డే, కేథరిన్ ట్రెసా ఇందులో హీరోయిన్లుగా నటిస్తారని టాక్. అలాగే... త్రివిక్రమ్ చిరకాల…

డియర్ కామ్రేడ్ టీజర్ రిలీజ్
గీత గోవిందం సినిమా తరువాత విజయ్ దేవరకొంద, రష్మిక మందన జంటగా తెరకెక్కుతున్న సినిమా డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గత కొద్ది కాలంగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో.. వినూత్నకథ తో తెరకెక్కుతున్న ఈసినిమాపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ నాలుగు భాషలలో ఒకేసారి టీజర్ ను రిలీజ్ చేశారు.

మరోసారి మనసు దోచుకున్న మహర్షి
సూపర్ స్టార్ మహేష్ బాబు అటు సినిమాల్లోనే కాదు ఇటు సేవా కార్యక్రమాల్లో కూడా యాక్టివ్ గా ఉంటారని మనకు చాలా సందర్భాల్లోనే నిరూపితమైంది. కుడి చేతితో చేసే సాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అన్నదాన్ని బాగా ఫాలో అవుతాడు మహేష్. అందుకే ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా సైలెంట్ గా ఉంటాడే తప్పా.. పబ్లిసిటీ చేసుకునే మనిషి కాదు.

షూటింగ్ పూర్తి చేసుకున్న బిగ్ బి
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో సైరా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. గత కొద్ది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న సైరా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి రాజగురువు 'గోసాయి వెంకన్న' పాత్రలో అమితాబ్ కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా జరుగుతున్న షెడ్యూల్ లో షూటింగ్ ను పూర్తి చేశాడు బిగ్ బి అమితాబ్ బచ్చన్. గతంలో ఓ షెడ్యూల్ ను పూర్తి చేసిన బిగ్ బి.. గత కొద్ది రోజులుగా మరో షెడ్యూల్ లో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి తన ట్విట్టర్ ద్వారా బిగ్ బి కి కృతజ్ఞతలు తెలిపారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆడియో రిలీజ్ వేదిక ఖరారు
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ఓ కీలకఘట్టం ఆధారంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మూవీ పోస్టర్స్ దగ్గర నుండి ఈసినిమాలోని పాటలతో, టీజర్ తో, ట్రైలర్ తో సినిమాకు ఓ రేంజ్ లో క్రేజ్ తీసుకొచ్చాడు వర్మ. ఇక ఈ నెల 22వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమాకు రిలీజ్ విషయంలో మాత్రం కాస్త ఇబ్బందులు తలెత్తాయి. మరి లీగల్ గా వెళుతున్న ఈ వ్యవహారంలో ఆఖరికి ఏమవుతుందో చూడాలి.

అఫీషియల్ -సైలెన్స్ లో హాలీవుడ్ హీరో
హేమంత్ దర్శకత్వంలో అనుష్క, మాధవన్, అంజలి, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో సైలెన్స్ అనే సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. మార్చిలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా తెలుగు, తమిళ్ మరియు ఇంగ్లీష్ లో ఒకేసారి షూటింగ్ జరుపుకోనుంది. అంతేకాదు కాదు తెలుగు, తమిళం, హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణుల తో నిర్మితమవుతున్న తొలి క్రాస్ ఓవర్ చిత్రమిది.

RRR - అలియా, అజయ్ షూటింగ్ అప్ డేట్
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమా విషయంలో ఉన్న డౌట్లన్నింటికీ రాజమౌళి మొన్న జరిగిన ప్రెస్ మీట్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. దీంతో దాదాపు ఈ సినిమా విషయంలో వస్తున్న, వచ్చే పుకార్లకు ఇంక బ్రేక్ పడినట్టే.

`నువ్వు తోపురా` రిలీజ్ డేట్ ఫిక్స్
హరినాథ్ బాబు.బి దర్శకత్వంలో సుధాకర్ కోమాకుల హీరోగా తెరకెక్కుతున్న సినిమా `నువ్వు తోపురా`. బేబి జాహ్నవి సమర్పణలో యునైటడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఎస్.జె.కె.ప్రొడక్షన్స్ (యు.ఎస్.ఎ) పై డి.శ్రీకాంత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. ఏప్రిల్ 26న ఈ సినిమా విడుదల కానుంది.

`సూర్యకాంతం`కి `తొలిప్రేమ` కనెక్షన్
మెగా కాంపౌండ్ నుంచి తెలుగు తెరకు పరిచయమైన తొలి కథానాయిక కొణిదెల నిహారిక. `ముద్దపప్పు ఆవకాయ`, `నాన్న కూచి` వంటి వెబ్ సిరీస్‌ల్లోనూ... `ఒక మనసు`, `హ్యాపీ వెడ్డింగ్` వంటి సినిమాల్లోనూ నటించి తెలుగువారికి మరింత చేరువైంది ఈ మెగా డాటర్. కాగా... ఈ టాలెంటెడ్ గర్ల్ నటించిన తాజా చిత్రం `సూర్యకాంతం` విడుదలకు సిద్ధమైంది. వేసవి కానుకగా మార్చి 29న తెరపైకి రానున్న ఈ సినిమాకి `ముద్దపప్పు ఆవకాయ` ఫేమ్ ప్రణీత్ దర్శకత్వం వహించాడు. నిహారిక సోదరుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సమర్పకుడిగా వ్యవహరించాడు. టీజర్, సింగిల్స్‌తో ఆకట్టుకున్న ఈ సినిమాపై సర్వత్రా మంచి ఆసక్తి…