
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 77


ప్రభాస్20 కోసం 18 సెట్లు?

నాని 25... టైటిల్ అదేనా?

టాప్ ట్రెండింగ్ మూవీస్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్

తెలుగు అర్జున్ రెడ్డితో హిందీ ప్రీతి

మరో ఛాన్స్ కొట్టేసిన ఆర్స్ఎక్స్ 100 బ్యూటీ

ఏడాది పూర్తి చేసుకున్న రంగస్థలం

నితిన్ 'భీష్మ' ప్రీ లుక్ రిలీజ్

డ్యూయెల్ రోల్లో జాన్వీ కపూర్

దసరాకి సరదాలు పంచనున్న కీర్తి సురేష్

ఫ్యాన్స్ కు 'సీత' టీమ్ సర్ ప్రైజ్

సూపర్ డీలక్స్ కు సూపర్ రెస్పాన్స్

బాలీవుడ్ లోకి ఎఫ్2 మూవీ

ఎవరి పంతం నెగ్గుతుందో!
సైరా లాస్ట్ షెడ్యూల్ లో సుదీప్

మహేష్ బాబు తో నటించడం హ్యాపీ
బ్లాక్ బస్టర్ దూకుడు మూవీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక స్పెషల్ సాంగ్ లో మీనాక్షి దీక్షిత్ నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందుతున్న మహర్షి మూవీ లో మీనాక్షి దీక్షిత్ ఒక కీలక పాత్రలో నటించారు. 8సంవత్సరాల తరువాత మహేష్ బాబు తో నటించిన మీనాక్షి దీక్షిత్ ఆనందం ఆమె మాటల్లోనే ... దూకుడు మూవీ తరువాత మహర్షి మూవీ లో మహేష్ బాబు తో నటించడం థ్రిల్లింగ్ గా ఉందన్నారు.

చైతూ, సామ్... ఏడాది గ్యాప్‌లో మూడు ఆసక్తికరమైన అనుభూతులు..
రీల్ లైఫ్‌లో జంటగా నటించి అలరించిన నాగచైతన్య, సమంత... ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ దంపతులుగా కనువిందు చేస్తున్నారు. పెళ్ళయ్యాక ఈ ఇద్దరూ కలసి నటించిన తొలి చిత్రంగా `మజిలీ` తెరపైకి రాబోతోంది. ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రభాస్20 కోసం 18 సెట్లు?
Yయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓ పిరియాడికల్ లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. `జిల్` రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.

నాని 25... టైటిల్ అదేనా?
నేచురల్ స్టార్ నాని 25 చిత్రాల మైలురాయికి చేరువవుతున్నాడు. ఈ వేసవిలో విడుదల కానున్న `జెర్సీ` నాని 23వ సినిమా కాగా... సెట్స్ పైనున్న `గ్యాంగ్ లీడర్` 24వ చిత్రం. ఇక తన తొలి చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నటించబోతున్న కొత్త సినిమా... సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ (25వ చిత్రం)గా తెరకెక్కనుంది. ఇందులో నానిది పూర్తిస్థాయి కథానాయకుడి పాత్ర కాదు... ఓ డిఫరెంట్ రోల్లో కనిపిస్తాడని సమాచారం. హీరోగా సుధీర్ బాబు నటిస్తుండగా... కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నాని దర్శనమివ్వనున్నాడని టాక్.

టాప్ ట్రెండింగ్ మూవీస్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్
అసలు రిలీజ్ అవుతుందా? అయితే ఎప్పుడవుతుంది..? కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో డౌట్లు.. ఎన్నో అవాంతరాల మధ్య ఫైనల్లీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం ఒక్క ఏపీలో తప్ప ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాకు రెస్పాన్స్ మాత్రం బాగానే వస్తుంది. టీడీపీ వాళ్లు వర్మ చెప్పింది అబద్దం అంటుండగా.. వేరే పార్టీ వాళ్లు మాత్రం వర్మ అద్బుతంగా సినిమాను తెరకెక్కించాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా సినిమాకు మాత్రం మంచి రెస్పాన్స్ తో పాటుగా కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నట్టు తెలుస్తోంది.

తెలుగు అర్జున్ రెడ్డితో హిందీ ప్రీతి
సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'అర్జున్ రెడ్డి' ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటివరకూ ఉన్న మూస ధోరణి సినిమాలకు ఈ సినిమా ట్రెండ్ సెట్ చేసింది. ఇక ఈసినిమాతో అప్పటికే పెళ్లి చూపులు సక్సెస్ తో ఉన్న విజయదేవరకొండ స్టార్ డమ్ ఒక్కసారిగా మారిపోయింది. యూత్ ఐకాన్ గా ముద్దుగా రౌడి హీరో అంటూ టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో రేంజ్ కు ఎదిగిపోయాడు.

మరో ఛాన్స్ కొట్టేసిన ఆర్స్ఎక్స్ 100 బ్యూటీ
ఒక్క సినిమా హిట్ అయితే చాలు ఆసినిమాలో హీరో, హీరోయిన్లకు ఇండస్ట్రీ నుండి వరుస ఆఫర్లు రావడం సహజమే. అలా తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి వరుస ఆఫర్లు కొట్టేస్తుంది ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 లో తన బోల్డ్ నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకొని మంచి పేరు సంపాదించుకుంది పాయల్.

ఏడాది పూర్తి చేసుకున్న రంగస్థలం
కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపించమే కాదు పదికాలాల పాటు అలా గుర్తిండిపోతాయి. ఒకప్పటి సినిమాలకైతే ఇది బాగా వర్తిస్తుంది. ఆనాటి ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, ఎస్వీ రంగారావు, సూర్యకాంతం, గుమ్మడి, ఛాయాదేవి ఇలా ఉద్దండులెందరో కలిసి నటించిన అద్భుత కావ్యం 'మయా బజార్' ఇప్పటికీ మనకి గుర్తొస్తూనే ఉంటుంది...ఇకపై కూడా గుర్తుచేసుకుంటూనే ఉంటాం. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.. అలా వచ్చి ఇలా వెళ్లిపోయే సినిమాలే తప్ప ప్రేక్షకుల మనసుల్లోకి వెళ్లి.. సహజత్వానికి దగ్గరగా ఉన్న సినిమాలు రావడం చాలా తక్కువ. అలాంటి ఈనాటి పరిస్థితుల మధ్య వచ్చిన ఓ ఆణిముత్యంలాంటి సినిమా రంగస్థలం.

నితిన్ 'భీష్మ' ప్రీ లుక్ రిలీజ్
గత కొద్ది కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్ ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. పరాజయాలు ఎదురైనా కూడా ఎక్కడా తగ్గకుండా వరుస సినిమాలు చేస్తూ తన దూకుడును కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక వెంకీ కుడుముల దర్శకత్వంలో తను భీష్మ సినిమా చేస్తున్నట్టు గతంలోనే చెప్పిన సంగతి తెలసిందే. అంతేకాదు తన పుట్టినరోజు నాటికి మరో రెండు సినిమాలు ప్రకటిస్తానని కూడా కొన్ని రోజుల క్రితమే చెప్పాడు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ యేలేటితో ఒక సినిమా చేయనున్నట్టుగా ఇటీవలే ప్రకటించాడు. ఇక ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా ఆయన మరో ప్రాజెక్టును గురించి ప్రకటించాడు. ఇంతకుముందు తనతో 'ఛల్ మోహన్ రంగా' చేసిన కృష్ణచైతన్యతోనే మరో సినిమాను…

డ్యూయెల్ రోల్లో జాన్వీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి... పలు చిత్రాల్లో ద్విపాత్రాభినయంతో అలరించారు. ఇప్పుడు శ్రీదేవి బాటలోనే... ఆమె తనయ జాన్వీ కపూర్ కూడా వెళ్ళనుందని బాలీవుడ్ టాక్. ఆ వివరాల్లోకి వెళితే... త్వరలో జాన్వీ ఓ హారర్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఎక్స్ క్లూజివ్ బర్త్ డే స్పెషల్ న్యూస్ ఫ్రమ్ నితిన్
టాలీవుడ్ లో వన్ అఫ్ ద టాలెంటెడ్ యంగ్ స్టార్ గా గుర్తింపు పొందిన నితిన్ బర్త్ డే ఈరోజు. 2002లో సంచలన విజయాన్ని సాధించిన “ జయం” చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన నితిన్ అతి తక్కువ కాలంలోనే తెలుగులో one of the సెలబ్రిటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా, సింగర్ గా, బ్రాండ్ అంబాసిడర్ గా తనను తాను విస్తృత పరుచుకున్న నితిన్ కు ఒక టాలెంటెడ్ హీరో గా ఎంత మంచి పేరు వచ్చిందో డాన్సింగ్ స్టార్ గా కూడా అంత మంచి గుర్తింపు వచ్చింది. జయం, సై, గుండెజారి గల్లంతయ్యింది, చిన్నదాన నీకోసం, ఇష్క్, టక్కరి, ఆటాడిస్తా, అ ఆ వంటి అనేక చిత్రాలు నితిన్ లోని హై ఓల్టేజ్ పెర్ఫార్మెన్స్ కు అద్దం పట్టాయి…

దసరాకి సరదాలు పంచనున్న కీర్తి సురేష్
గత ఏడాది వేసవిలో `మహానటి`గా మురిపించిన కేరళకుట్టి కీర్తి సురేష్... స్వల్ప విరామం తరువాత మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు నరేంద్ర రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని `118` ఫేమ్ మహేష్ కోనేరు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాడు. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నదియా, రాజేంద్ర ప్రసాద్, నరేష్, భానుశ్రీ మెహ్రా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

`నిన్నే పెళ్ళాడతా` తరువాత మళ్ళీ `మన్మథుడు 2`లో...
కింగ్ నాగార్జున నటించిన పలు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. వాటిలో `నిన్నే పెళ్ళడతా` ఒకటి. 1996లో విడుదలైన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్... ఆ ఏడాదిలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఆ సినిమాలో నాగ్‌కి అమ్మగా మహాలక్ష్మి పాత్రలో ఎంతో సహజంగా నటించిన సీనియర్ హీరోయిన్ లక్ష్మి... సుదీర్ఘ విరామం తరువాత మళ్ళీ నాగ్‌కి తల్లి పాత్రలో కనిపించనున్నారని టాలీవుడ్ టాక్.

ఫ్యాన్స్ కు 'సీత' టీమ్ సర్ ప్రైజ్
తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా సీత. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. కాని కొన్ని కారణాల వలన సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకునే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారని ఇప్పటికే టాక్స్ వినిపిస్తున్నాయి.

చంద్రబాబు వ్యతిరేకులకు - లక్ష్మీపార్వతి అనుకూలురకు పండగ లాంటి .. “లక్ష్మీస్ ఎన్టీఆర్”
ఇక రాంగోపాల్ వర్మ తన కో- డైరెక్టర్ అగస్త్య మంజు తో సంయుక్త దర్శకత్వాన్ని నిర్వహించడం ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన విశేషం. మొత్తం మీద సినిమా ప్రారంభం నుండి రిలీజ్ వరకు రాంగోపాల్ వర్మ సృష్టించిన వివాదాలు, కురిపించిన స్టేట్మెంట్స్, తెలుగుదేశం వర్గాల నిరసనలు, నిలిపేసే ప్రయత్నాలు వెరసి లక్ష్మీస్ ఎన్టీఆర్ పట్ల అంచనాలను, ఎదురుచూపులను రెట్టింపు చేశాయి. ఆ అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోయినప్పటికీ " లక్ష్మీస్ ఎన్టీఆర్" ను మంచి అటెన్షన్ డ్రాయింగ్ సెన్సేషన్ గా చెప్పుకోవచ్చు.


సూపర్ డీలక్స్ కు సూపర్ రెస్పాన్స్
టి. కుమార రాజా దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా సూపర్ డీలక్స్. టీజర్, ట్రైలర్ తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఈ రోజు రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అంచనాలకు తగ్గట్టుగానే ఈసినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ లోకి ఎఫ్2 మూవీ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన మల్టీ స్టారర్ 'ఎఫ్2' ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలుసు. సంక్రాంతి బరిలో దిగిన ఈసినిమా పెద్ద సినిమాలను సైతం పక్కకు నెట్టి విన్నర్ గా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందరి మన్ననలు పొందింది. అంతేకాదు ప్రస్టేషన్, అంతేగా అంతేగా అనే డైలాగ్స్ మోస్ట్ పాపులర్ డైలాగ్స్ లిస్ట్ లో చేరాయి. ఇక ఈ సినిమా కలెక్షన్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకు.. అటు వెంకీ, వరుణ్ కు ముగ్గురికీ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ తెచ్చిపెట్టింది.

ఎవరి పంతం నెగ్గుతుందో!
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. మరో షాక్ తగిలింది. తాజాగా ఈ చిత్రం విడుదల ఆపాలని ఏపీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఏప్రిల్ 3 వ తేదీన సాయంత్రం 4 గంటలకు హైకోర్టు జడ్జి ఛాంబర్ లో ప్రివ్యూ ప్రదర్శించాలని.. సినిమా చూసిన తర్వాత నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు ఆదేశించినట్టు తెలుస్తోంది. మరి సినిమా చూసిన తరువాత హైకోర్టు ఏం చెబుతుందో చూడాలి..
సైరా లాస్ట్ షెడ్యూల్ లో సుదీప్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఇక ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దాదాపు సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చినట్టే తెలుస్తోంది.