రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. మరో షాక్ తగిలింది. తాజాగా ఈ చిత్రం విడుదల ఆపాలని ఏపీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఏప్రిల్ 3 వ తేదీన సాయంత్రం 4 గంటలకు హైకోర్టు జడ్జి ఛాంబర్ లో ప్రివ్యూ ప్రదర్శించాలని.. సినిమా చూసిన తర్వాత నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు ఆదేశించినట్టు తెలుస్తోంది. మరి సినిమా చూసిన తరువాత హైకోర్టు ఏం చెబుతుందో చూడాలి..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇటువంటి సినిమాను తీసినందుకు వర్మను అభినందించకుండా ఉండలేమని ప్రశంసిస్తున్నారు. ఎన్టీఆర్-లక్ష్మీపార్వతి మధ్య నడిచిన ఓల్డేజ్ లవ్ స్టోరీని ఆకట్టుకునేలా చూపించారని అంటున్నారు. ఎన్టీఆర్-లక్ష్మీపార్వతి మధ్య నడిచిన ఓల్డేజ్ లవ్ స్టోరీని ఆకట్టుకునేలా చూపించారని.. సినిమాకు కల్యాణ్ మాలిక్ అందించిన సంగీతం బాగుందని కొనియాడుతున్నారు. లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞాశెట్టి.. ఎన్టీఆర్ పాత్రలో పి.విజయ్ కుమార్ అత్యద్భుతంగా నటించారని చెబుతున్నారు.
మరి ఏపీలో ఈసినిమా ఎన్నికల ముందే రిలీజ్ అవుతుందో.. ఎన్నికల తరువాత రిలీజ్ అవుతుందో.. హైకోర్టు ఏ తీర్పు ఇస్తుందో? ఎన్నికల ముందో సినిమా రిలీజ్ చేయాలన్న వర్మ పంతం నెగ్గుతుందా..? లేక ఎన్నికల తరువాతే రిలీజ్ చేయాలన్న ఏపీ ప్రభుత్వం పంతం నెగ్గుతుందా? ఇలా అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మాత్రం ఏప్రిల్ 3 వరకూ వెయిట్ చేయాల్సిందే.
[youtube_video videoid=_O6zLbTPn3k]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























