సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఇక ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దాదాపు సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చినట్టే తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో పలువురు ప్రముఖులు నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్ బిగ్ బి అమితాబ్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయనతో పాటు కన్నడ స్టార్ సుదీప్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు. ఇలా అన్ని భాషల నుంచి ప్రముఖ నటులతో.. టెక్నీషియన్స్ తో పాన్ ఇండియా సినిమాగా సైరా రూపొందుతుంది.
ఇక ఈ సినిమా తాజా అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సుదీప్ తన షూటింగ్ అప్ డేట్ ఇచ్చారు. సైరాలో తనది లాస్ట్ షెడ్యూల్ అని.. లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ లో ఉన్నానని.. ఈ సినిమాతో ఎన్నో మధురమైన జ్ఞాపకాలను సంపాదించుకున్నాను.. ఇంత మంచి టీమ్ తో నేను కూడా అసోసియేట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందంటూ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.
My last schedule for #Syieraa.
I carry great moments from this set. To be a part or a set having Fabulous technicians n an awesome cast from pan India is always a delight. @DirSurender has put his heart into this project n has justified his role as a director. Huggs to all 🤗🤗👏— Kichcha Sudeepa (@KicchaSudeep) March 29, 2019
ఇక ఈసినిమాలో చిరంజీవి సరనస నయనతార నటిస్తుండగా.. ఇంకా తమన్నా, నిహారిక కూడా పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
[youtube_video videoid=eVR5aHxO5AQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: