టాలీవుడ్ లో వన్ అఫ్ ద టాలెంటెడ్ యంగ్ స్టార్ గా గుర్తింపు పొందిన నితిన్ బర్త్ డే ఈరోజు. 2002లో సంచలన విజయాన్ని సాధించిన “ జయం” చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన నితిన్ అతి తక్కువ కాలంలోనే తెలుగులో one of the సెలబ్రిటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా, సింగర్ గా, బ్రాండ్ అంబాసిడర్ గా తనను తాను విస్తృత పరుచుకున్న నితిన్ కు ఒక టాలెంటెడ్ హీరో గా ఎంత మంచి పేరు వచ్చిందో డాన్సింగ్ స్టార్ గా కూడా అంత మంచి గుర్తింపు వచ్చింది. జయం, సై, గుండెజారి గల్లంతయ్యింది, చిన్నదాన నీకోసం, ఇష్క్, టక్కరి, ఆటాడిస్తా, అ ఆ వంటి అనేక చిత్రాలు నితిన్ లోని హై ఓల్టేజ్ పెర్ఫార్మెన్స్ కు అద్దం పట్టాయి. మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆఫ్ టాలీవుడ్ గా గుర్తింపు పొందిన నితిన్ కు గత కొంతకాలంగా కొన్ని పరాజయాలు ఎదురైనప్పటికీ ఒక ప్రామిసింగ్ యంగ్ స్టార్ గా అతనికి ఉన్న క్రేజ్ అండ్ డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోగా తన 17 సంవత్సరాల కెరీర్ లో ఎన్నో అద్భుత విజయాలను సొంతం చేసుకున్న నితిన్ కు తొలి చిత్రమైన “జయం” తోనే అవార్డులు- రివార్డులు దక్కాయి. జయం లో తన పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ కు గాను ప్రతిష్టాత్మకమైన ” ఫిలింఫేర్ బెస్ట్ డెబ్యూ యాక్టర్” గా అవార్డు అందుకున్న నితిన్ కు ప్రేక్షకుల రివార్డులు కూడా పుష్కలంగా దక్కాయి. కాగా ఈ మార్చి 30 తో 35వ పడిలోకి అడుగు పెడుతున్న నితిన్ నుండి బర్త్ డే స్పెషల్ న్యూస్ గా ఒక సంచలన వార్తను ఎక్స్ క్లూజివ్ గా సేకరించింది “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం”.
ఈరోజు తన బర్త్ డే సందర్భంగా వచ్చిన వార్తలలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 6 గా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కనున్న
చిత్రానికి వెరీ వెరీ పవర్ ఫుల్ టైటిల్ ను నిర్ణయించారు. ఆ టైటిల్ ను ఎక్స్ క్లూజివ్ గా “ద ఫిలింనగర్ డాట్ కామ్” తో షేర్ చేసుకున్నారు నితిన్. అదే “పవర్ పేట”. నితిన్ బాడీ లాంగ్వేజ్ లో, అప్పియరెన్స్ లో క్లాస్ అప్పీల్ ఎంత ఉందో అతని పర్ఫార్మెన్స్ లో మాస్ అప్పీల్ అంతకు రెట్టింపు ఉంది. ఆ మాస్ అప్పీల్ కు సరిపడే పవర్ ఫుల్ యాక్షన్ ప్యాకేజ్ గా వస్తున్న చిత్రమే “పవర్ పేట”. అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న భీష్మ, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ టెన్ చిత్రాలు కూడా నితిన్ కు అద్భుత విజయాలను అందించగలవు అన్న అంచనాలు నిండుగా ఉన్నాయి.
కాగా కృష్ణచైతన్య దర్శకత్వంలో నితిన్ తండ్రి గారైన ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ” పవర్ పేట” ఈ సంవత్సరం ఆఖరిలో షూటింగ్ ప్రారంభించి 2020 సమ్మర్ కు రిలీజ్ చేయాలనే సన్నాహాల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది…
So let us say Happy Birthday and All the Best to Nithin – the handsome Young Star .
[youtube_video videoid=z6KOmkwGaO4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: