
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 46


‘ఆర్ ఆర్ ఆర్’ తాజా షెడ్యూల్... కండిషన్స్ అప్లై

అడవి శేష్ మూవీ టైటిల్ "ఎవరు "

‘సాహో’కి దారిస్తున్న ఆ హిందీ చిత్రాలు?

రవితేజ సరసన శృతి హాసన్?

రాఘవ లారెన్స్ దర్శకత్వంలోనే "లక్ష్మీ బాంబ్ "

రైతుగా, ఎన్నారైగా చిరు ద్విపాత్రాభినయం?

వన్ ఇయర్ కట్ చేస్తే సీన్ రివర్స్

జూలై నెలలో ఆసక్తికరమైన చిత్రాలు

స్పెషల్ డేన చిరు, కొరటాల మూవీ లాంఛింగ్?
రానా తో గుణశేఖర్ - హిరణ్య కశిప అప్ డేట్

మురళీమోహన్ ను పరామర్శించిన చిరంజీవి

ఓ బేబీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

AA19 షూటింగ్ సెకండ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం

స్పెషల్ మూవీ ప్రీమియర్ షో కు అద్భుత స్పందన

కార్తి ఖైదీ టీజర్ రిలీజ్

సెన్సార్ పూర్తి చేసుకున్న 'కిల్లర్'
ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ హీరో విజయ్ ఆంటోని ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా కొలైకరన్. తెలుగులో కిల్లర్ పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా జూన్ 7వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ లభించింది.

‘ఆర్ ఆర్ ఆర్’ తాజా షెడ్యూల్... కండిషన్స్ అప్లై
యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాడు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో ఈ పిరియాడిక్ డ్రామా తెరకెక్కుతోంది.

అడవి శేష్ మూవీ టైటిల్ "ఎవరు "
అడవి శేష్ సినీకెరీర్ మూడు కథలు , ఆరు సినిమాలుగా విరాజిల్లుతుంది. క్షణం, అమీ తుమీ వంటి సక్సెస్ ఫుల్ సినిమాలలో నటించిన అడవి శేష్ గూఢచారి మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. క్షణం మూవీ కి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. అడవి శేష్ పలు మూవీస్ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు .

యూ ట్యూబ్‌లో `రౌడీ బేబీ` సెన్సేషన్... హాఫ్ బిలియన్ వ్యూస్!
సాయిపల్లవి… ఈ తరం ప్రేక్షకులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. తన నృత్యాలతో కుర్రకారుని ఫిదా చేస్తున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ ఖాతాలో తాజాగా ఓ అరుదైన రికార్డు చేరింది.ఆ వివరాల్లోకి వెళితే… ధనుష్, సాయిపల్లవి జంటగా నటించిన తమిళ చిత్రం ‘మారి 2’. గతేడాది డిసెంబర్ 21న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే… ఈ చిత్రం కోసం ధనుష్, సాయిపల్లవి కలసి నర్తించిన “రౌడీ బేబీ” పాట మాత్రం థియేటర్లలో ప్రేక్షకుల చేత స్టెప్పులు వేయించింది.

‘సాహో’కి దారిస్తున్న ఆ హిందీ చిత్రాలు?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘సాహో’. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.

రవితేజ సరసన శృతి హాసన్?
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘డిస్కో రాజా’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ ఇటీవలే మొదలైంది.

రాఘవ లారెన్స్ దర్శకత్వంలోనే "లక్ష్మీ బాంబ్ "
రాఘవ లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వం లో రూపొందిన తమిళ మూవీ ముని, తెలుగు డబ్బింగ్ వెర్షన్ కాంచన ఘనవిజయం సాధించాయి. లారెన్స్ దర్శకత్వం లో అక్షయ్ కుమార్ హీరోగా కాంచన హిందీ రీమేక్ మూవీ లక్ష్మీ బాంబ్ అనౌన్స్ చేశారు. తన ప్రమేయం లేకుండా "లక్ష్మీ బాంబ్ " మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడంతో అవమానం గా భావించి ఆ మూవీ నుండి వైదొలుతున్నట్టుగా లారెన్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

రైతుగా, ఎన్నారైగా చిరు ద్విపాత్రాభినయం?
వాణిజ్యపరమైన అంశాలతో సినిమాలను తెరకెక్కిస్తూనే… వాటిలో అంతర్లీనంగా సామాజిక అంశాలనూ టచ్ చేయడం దర్శకుడు కొరటాల శివ స్టైల్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే తన తదుపరి చిత్రం కోసం కూడా అటువంటి కథనే సిద్ధం చేసాడట ఈ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్.

వన్ ఇయర్ కట్ చేస్తే సీన్ రివర్స్
ఒక ఫ్యామిలీ నుండి ఇద్దరు హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఉంటే వారిలో ఒకరికి లక్ బాగా కలిసొస్తుందన్న వాస్తవం అనాది నటీనటుల నుండి చూస్తూనే ఉన్నాం. రాధిక, నిరోషా లలో రాధిక బాగా సక్సెస్ అయింది.. భానుప్రియ, శాంతి ప్రియ లలో భానుప్రియ సక్సెస్ అయింది…అలానే నేటి హీరోయిన్లలో కాజల్, నిషా అగర్వాల్ లలో కాజల్ క్లిక్ అయింది.. ఇలా ఒకరు మాత్రమే స్టార్ హీరోయిన్ గా క్లిక్ అయ్యారు. ఇప్పుడు టాలీవుడ్ కు మరో ఇద్దరు అక్కా చెల్లెళ్లు అరంగేట్రం చేస్తున్నారు. వారు ఎవరో కాదు రాజశేఖర్ కూతుళ్లు శివాని మరియు శివాత్మిక.

జూలై నెలలో ఆసక్తికరమైన చిత్రాలు
జూలై నెల… సంవత్సరంలో ద్వితీయార్ధానికి మొదటి నెల. ఇంకా చెప్పాలంటే… సంవత్సరానికి “సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్”. అటువంటి నెలలో ప్రతీ వారాన్ని టార్గెట్ చేస్తూ… తెలుగునాట వరుసగా కొన్ని ఆసక్తికరమైన చిత్రాలు తెరపైకి రానున్నాయి. అంతేకాదు… ప్రతీ వారం ఒక్కో జానర్‌కి చెందిన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండడం ఆసక్తికరమైన అంశం.

స్పెషల్ డేన చిరు, కొరటాల మూవీ లాంఛింగ్?
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ పిరియాడిక్ డ్రామాను కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ని జూన్ నెలాఖరు కల్లా కంప్లీట్ చేయనున్నారని టాక్. ఇదిలా ఉంటే… ‘సైరా’ సెట్స్ పై ఉండగానే కొరటాల శివ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరిందని టాలీవుడ్ టాక్.

పంజాబీ చిత్రసీమలో ఎంట్రీ ఇవ్వనున్న `ఎఫ్ 2` భామ
మెహరీన్ కౌర్ పిర్జాడా… పేరుకి పంజాబీ భామే అయినా తెలుగు సినిమాతోనే వెండితెరకు పరిచయమైంది. అంతేకాదు… తొలి అడుగుల్లోనే ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’, ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’ రూపంలో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంది మెహరీన్. మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించినా… ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్ 2’తో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే… ఇప్పుడు ఈ స్టన్నింగ్ బ్యూటీ నటించిన పంజాబీ చిత్రం ఒకటి విడుదలకు సిద్ధంగా ఉంది.
రానా తో గుణశేఖర్ - హిరణ్య కశిప అప్ డేట్
రానా దగ్గబాటి, గుణశేఖర్ కాంబినేషన్ లో పౌరాణిక గాథ “హిరణ్య కశిప” అనే సినిమా తెరకెక్కిస్తున్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈసినిమాపై అసలు నిజమా.. రూమర్లు మాత్రమేనా అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని… ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందని గతంలోనే సురేష్ బాబు క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా గురించి ఓ అనౌన్స్ మెంట్ ఇచ్చారు చిత్రయూనిట్.

మురళీమోహన్ ను పరామర్శించిన చిరంజీవి
ఈనాడు మెగాస్టార్ గా సుప్రసిద్ధులైన చిరంజీవి చిత్ర రంగ ప్రవేశం చేసే నాటికి మురళీమోహన్ ఒక ప్రముఖ హీరో. అయితే హీరోగా వర్ధమాన దశలో ఉన్న చిరంజీవిని మురళీమోహన్ ఎంతగానో ప్రోత్సహించేవారు. అప్పటినుండి బలపడిన వారి అనుబంధంలో ఎన్నెన్నో మధురస్మృతులు ఉన్నాయి. ఇరు కుటుంబాల మధ్య చక్కని స్నేహ సంబంధాలు ఉన్నాయి. తన కళ్ళ ముందు వచ్చిన చిరంజీవి దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతుంటే ఎంతో సంతోషించేవారు మురళీమోహన్. అలాగే వృత్తి పరంగా కూడా ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన అనుబంధం వీరిది.
అలా జరిగితే మహేష్ బాబు,అనిల్ రావిపూడి, దిల్ రాజు,అనిల్ సుంకర లను నేను సన్మానిస్తా - అదిశేషగిరావు
"లక్ష్యమే కాదు దానిని సాధించిన మార్గం కూడా ఉన్నతంగా ఉండాలి" అంటారు మహాత్మా గాంధీ. అలాగేే ఒక విజయవంతమైన సినిమా ఇవ్వాలి అనే లక్ష్యం మంచిదే అయినప్పటికీ దానిని నిర్మించే సమయము, అందుకు చేసే ఖర్చు కూడా హద్దులు దాట కూడదు. ఈతరం దర్శకులలో కొంతమంది మంచి హిట్ చిత్రాలను ఇవ్వగలుగుతున్నారు గానీ అనుకున్న బడ్జెట్లో , సకాలంలో ఇవ్వలేకపోతున్నారు. ఇందువల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ హద్దులు దాటి పోవటమే కాకుండా రకరకాల అనర్థాలకు కారణం అవుతున్నారు సదరు దర్శకులు.

ఓ బేబీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
సక్సెస్ ఫుల్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై రూపొందిన ఓ బేబీ మూవీ జూలై 5వ తేదీ రిలీజ్ కానుంది. నాగశౌర్య, సీనియర్ నటి లక్ష్మి, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. మిక్కీ J మేయర్ సంగీతం అందించారు.

AA19 షూటింగ్ సెకండ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, హారిక &హాసిని బ్యానర్స్ పై AA19 మూవీ రూపొందుతున్న విషయంతెలిసిందే.AA19 మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. మరి కొన్ని రోజులలో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమయి నిరవధికంగా జరుగుతుందని సమాచారం. పూజ హెగ్డే కథానాయిక కాగా, బాలీవుడ్ నటి టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

స్పెషల్ మూవీ ప్రీమియర్ షో కు అద్భుత స్పందన
క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ , హీరో గా పలు చిత్రాలలో నటించిన అజయ్ ప్రధాన పాత్రలో, వాస్తవ్ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ పై నందా లాల్ క్రియేషన్స్ నిర్మాణ సారథ్యం లో ది స్టోరీ ఆఫ్ ఏ మైండ్ రీడర్ ట్యాగ్ లైన్ తో రూపొందిన స్పెషల్ మూవీ జూన్ 14వ తేదీ రిలీజ్ కానుంది. రంగా , అక్షత జంటగా నటించిన స్పెషల్ మూవీ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ పలువురికి ప్రీమియర్ షో ను ఏర్పాటు చేసింది.

కార్తి ఖైదీ టీజర్ రిలీజ్
వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో హీరో కార్తీ ఎప్పుడూ ముందుంటాడు. అందుకే తను చేసిన సినిమాల్లో ఒకదానికొకటి సంబంధం లేకుండా.. డిఫరెంట్ గా ఉంటాయి. ఇక ఈ ఏడాది దేవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తి ఇప్పుడు ఖైదీ అంటూ మరో విభిన్నమైన కథతో ముందుకొస్తున్నాడు. ఇటీవల పోస్టర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచిన యూనిట్ తాజాగా టీజర్ ను విడుదల చేసింది.

ఆ సినిమాల స్టోరీలైన్‌తో మహేష్ `సరిలేరు నీకెవ్వరు`?
తాజాగా విడుదలైన మహర్షితో హయ్యస్ట్ గ్రాసర్‌ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు… ప్రస్తుతం తన తదుపరి చిత్రం సరిలేరు నీకెవ్వరుపై దృష్టి సారించాడు. ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. మహేష్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా నిన్న (మే 31) టైటిల్ ఖరారు చేయడంతో పాటు… చిత్రాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించారు.