ప‌ంజాబీ చిత్రసీమ‌లో ఎంట్రీ ఇవ్వ‌నున్న `ఎఫ్ 2` భామ‌

F2 Heroine To Make Debut in Punjabi Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mehreen To Debut in Punjabi Movie,F2 Heroine Entry in Punjabi Film,Mehreen Next Film Details,Mehreen Got a Chance in Punjabi Movie
F2 Heroine To Make Debut in Punjabi Movie

మెహరీన్ కౌర్ పిర్జాడా… పేరుకి పంజాబీ భామే అయినా తెలుగు సినిమాతోనే వెండితెరకు పరిచయమైంది. అంతేకాదు… తొలి అడుగుల్లోనే ‘కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ‌’, ‘మ‌హానుభావుడు’, ‘రాజా ది గ్రేట్‌’ రూపంలో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంది మెహ‌రీన్‌. మ‌ధ్య‌లో కొన్ని ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించినా… ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ‘ఎఫ్ 2’తో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే… ఇప్పుడు ఈ స్ట‌న్నింగ్ బ్యూటీ నటించిన పంజాబీ చిత్రం ఒకటి విడుదలకు సిద్ధంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… దేవ్ ఖరౌడ్, మెహరీన్ జంటగా నటించిన పంజాబీ ఫిల్మ్‌ ‘డీఎస్పీ దేవ్’. మన్‌దీప్ బెనిపెల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంతో… మెహరీన్ త‌న మాతృభాష‌లో హీరోయిన్‌గా తొలి అడుగులు వేస్తోంది. కాగా… ఇటీవలే చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ సినిమాని జూలై 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే తెలుగుతో పాటు తమిళం, హిందీ భాష‌ల్లో న‌టించిన‌ మెహరీన్… ఇప్పుడు తన మాతృభాషలోనూ త‌న‌దైన ముద్ర వేస్తుందేమో చూడాలి.

ప్రస్తుతం… గోపీచంద్‌, నాగశౌర్య కొత్త చిత్రాల‌లో మెహ‌రీన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

[youtube_video videoid=IRmyPmrcPXA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − six =