ఆ సినిమాల స్టోరీలైన్‌తో మ‌హేష్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`?

Interesting Buzz About Mahesh Babu Sarileru Neekevvaru,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Film News,Mahesh Babu Sarileru Neekevvaru Movie Latest Updates,Mahesh Babu Sarileru Neekevvaru Movie Story Line,Mahesh Babu Next Film Details,Interesting Points About Sarileru Neekevvaru Film
Interesting Buzz About Mahesh Babu Sarileru Neekevvaru

తాజాగా విడుద‌లైన మహర్షితో హ‌య్య‌స్ట్‌ గ్రాస‌ర్‌ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు… ప్ర‌స్తుతం త‌న త‌దుప‌రి చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రుపై దృష్టి సారించాడు. ఈ హిలేరియస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. మహేష్ సరసన ర‌ష్మిక మందన్న క‌థానాయిక‌గా నటిస్తున్న‌ ఈ సినిమాలో విజ‌య‌శాంతి, రాజేంద్రప్రసాద్‌, జ‌గ‌ప‌తిబాబు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. అనిల్ సుంక‌ర‌, దిల్‌ రాజు, మ‌హేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా నిన్న (మే 31) టైటిల్‌ ఖరారు చేయ‌డంతో పాటు… చిత్రాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లబోయే ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో… ఈ చిత్ర‌కథకి సంబంధించిన అంశమొకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే… ఈ చిత్రాన్ని ‘వారసుడొచ్చాడు’(వెంక‌టేష్), ‘అతడు’(మ‌హేష్ బాబు) సినిమాల స్టోరీ లైన్ స్పూర్తితో రూపొందిస్తున్నట్టుగా సమాచారం. అంటే… ఒకరి స్థానంలోకి మరొకరు వ‌చ్చి క‌ష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకునే యువ‌కుడి క‌థ‌తో ఈ సినిమా ఉంటుంద‌ట‌.

క‌థ రీత్యా… మిలటరీలో ఆర్మీ మేజర్‌గా పనిచేసే మహేష్… తన స్నేహితుడి కోసం అనుకోని పరిస్థితుల మధ్య ఆ స్నేహితుడి గ్రామానికి రావడం జరుగుతుందట. అలా వ‌చ్చి అతని కుటుంబానికి సాయపడే నేప‌థ్యంలో జ‌రిగే ప‌రిణామాల‌తో ఈ చిత్ర కథ నడుస్తుందని టాక్. అంతేకాదు… ‘అతడు’ తరహాలోనే ఈ కథాంశం చుట్టూ అల్లుకునే సన్నివేశాలన్నీ చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటాయ‌ని తెలుస్తోంది. అలాగే మహేష్ స్నేహితుడి తల్లి పాత్రలో విజయశాంతి కనిపించనుందట. మ‌రి… ఈ వార్త‌ల్లో నిజమెంతో తెలియాలంటే 2020 సంక్రాంతి వ‌ర‌కు వేచిచూడాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=zCzNEtv7DzE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.