మురళీమోహన్ ను పరామర్శించిన చిరంజీవి

Megastar Chiranjeevi Meets Murali Mohan,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Film News,Megastar Chiranjeevi About Murali Mohan,Murali Mohan Health Condition is Critical,Mega Star Meets Murali Mohan,Chiranjeevi and His Wife Consoles Murali Mohan,Murali Mohan Latest News,Actor Murali Mohan Opens Up About His Health Condition
Adivi Sesh To Reveal His Secret Project Soon

ఈనాడు మెగాస్టార్ గా సుప్రసిద్ధులైన చిరంజీవి చిత్ర రంగ ప్రవేశం చేసే నాటికి  మురళీమోహన్ ఒక ప్రముఖ హీరో. అయితే హీరోగా వర్ధమాన దశలో ఉన్న చిరంజీవిని మురళీమోహన్ ఎంతగానో ప్రోత్సహించేవారు. అప్పటినుండి బలపడిన వారి అనుబంధంలో ఎన్నెన్నో మధురస్మృతులు ఉన్నాయి. ఇరు కుటుంబాల మధ్య చక్కని స్నేహ సంబంధాలు ఉన్నాయి. తన కళ్ళ ముందు వచ్చిన చిరంజీవి దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతుంటే ఎంతో సంతోషించేవారు మురళీమోహన్. అలాగే వృత్తి పరంగా కూడా  ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన  అనుబంధం వీరిది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక చిత్ర పరిశ్రమలో చిరంజీవి రిలేషన్స్ ను మెయింటెన్ చేయడంలోను, కష్టసుఖాల్లో పాలు పంచుకోవటంలోనూ అందరికంటే ఒక అడుగు ముందే ఉంటారు. తనతో చిరకాల అనుబంధం కలిగిన మురళీమోహన్ కు ఈమధ్య ఒక  మేజర్ ఆపరేషన్ జరిగిందని తెలిసిన వెంటనే సతీ సమేతంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు మెగాస్టార్ చిరంజీవి.

ఇటీవలే స్వర్గస్తులైన తల్లి గారి అంతిమ సంస్కారాలను నిర్వహించడం, ఆమె అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేసే నిమిత్తం కాశీ వెళ్ళటం, ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా పనిచేయటం వల్ల మురళీమోహన్ వెన్నుముక కు అత్యవసర శస్త్ర చికిత్స చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాదులోని ఒక ప్రముఖ హాస్పిటల్లో ఈ ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చిన మురళీమోహన్ ను వెంటనే  సతీ సమేతంగా వెళ్లి పరామర్శించారు మెగాస్టార్ చిరంజీవి. 

ఈ సందర్భంగా “మురళీమోహన్ గారితో నాకు, నా కుటుంబానికి చిరకాల అనుబంధం ఉంది. ఎంతో ఆరోగ్యంగా, చలాకీగా ఉండే మురళీ మోహన్ గారు త్వరగా కోలుకుని పూర్వపు ఉత్సాహంతో మన ముందుకు రావాలని  కోరుకుంటున్నాను” అన్నారు మెగాస్టార్ చిరంజీవి.

[subscribe]

[youtube_video videoid=46OLd0Ytdl0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =