యూ ట్యూబ్‌లో `రౌడీ బేబీ` సెన్సేష‌న్‌… హాఫ్ బిలియ‌న్ వ్యూస్‌!

Rowdy Baby Song Surpasses 500 Million Views,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Rowdy Baby Song is Trending in Youtube,Rowdy Baby Song Crosses 500 Million Views,Sai Pallavi Rowdy Baby Song Creates Another Record,Sai Pallavi Rowdy Baby Song Latest Updates
Rowdy Baby Song Surpasses 500 Million Views

సాయిపల్లవి… ఈ త‌రం ప్రేక్ష‌కుల‌కు పరిచయం చేయ‌న‌క్క‌ర్లేని పేరు. త‌న నృత్యాల‌తో కుర్ర‌కారుని ఫిదా చేస్తున్న ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్ ఖాతాలో తాజాగా ఓ అరుదైన రికార్డు చేరింది.ఆ వివరాల్లోకి వెళితే… ధనుష్, సాయిపల్లవి జంటగా నటించిన త‌మిళ‌ చిత్రం ‘మారి 2’. గతేడాది డిసెంబర్ 21న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే… ఈ చిత్రం కోసం ధనుష్, సాయిపల్లవి కలసి నర్తించిన “రౌడీ బేబీ” పాట మాత్రం థియేటర్ల‌లో ప్రేక్షకుల చేత స్టెప్పులు వేయించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కట్ చేస్తే… ఇప్పుడు ఇదే పాట యూ ట్యూబ్‌లోనూ సంచలనం సృష్టిస్తోంది. అత్యంత వేగంగా 100, 200 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ పాట… 300, 400 మిలియన్ వ్యూస్‌ను కూడా అవలీలగా దాటేసి… ఇప్పుడు దక్షిణాదిన 500 మిలియన్ (హాఫ్ బిలియ‌న్‌) వ్యూస్‌ను పొందిన‌ తొలి పాటగా రికార్డ్‌ క్రియేట్ చేసింది. అది కూడా యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన‌ 5 నెల‌ల‌కే ఈ ఫీట్‌ని సాధించ‌డం విశేషం.

హీరో ధనుష్ స్వయంగా రచించిన ఈ పాటను ఆయనతో పాటు డీ అనే గాయని కూడా ఆలపించింది. యువన్ శంకర్ రాజా సంగీతానికి ప్రభుదేవా స్టెప్పులు తోడై… ఈ పాట ఇప్పుడు సౌత్ ఇండియన్ సెన్సేషన్ సాంగ్‌గా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం… సాయిపల్లవి డ్యాన్స్ మూవ్స్‌కి ఫిదా అవుతున్న నెటిజ‌న్ల జోరు చూస్తూ ఉంటే… త్వరలోనే ఈ పాట బిలియన్ క్ల‌బ్‌లో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు.

[subscribe]

[youtube_video videoid=GyLOW3hf-KU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + nine =