తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు యువ నటుడు చరణ్ దీప్. ‘పటాస్’ సినిమాతో నెగటివ్ షేడ్స్ లో నటించిన చరణ్ దీప్ ఆ తరువాత ‘లోఫర్’ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించాడు. ఈ సినిమాలో తన పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పొచ్చు. అంతేకాదు.. ‘బాహుబలి’లో కాలకేయ తమ్ముడిగానూ, ‘పీఎస్వీ గరుడవేగ’లో పోలీస్ పాత్రలో కనిపించి తన నటనతో మళ్లీ ఆకట్టుకున్నాడు. కల్కీ సినిమాలో కూడా చరణ్ దీప్ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. గరుడ వేగలో పాజిటివ్ పాత్రలో నటించగా.. కల్కీ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అన్నింటికంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ లో కూడా నటించే అవకాశం దక్కించుకున్నాడు. సైరాలో ఓ కీలక పాత్రలోనే చరణ్ దీప్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా తన దగ్గరకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని, విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.
కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, కన్నడ భాషల్లో కూడా మంచి అవకాశాలు దక్కించుకుంటున్నాడు ఈ యువ నటుడు. ఇప్పుడు కొత్త మేకోవర్ తో జుట్టు బాగా పెంచి, కొంచెం గడ్డంతో స్టైలిష్ లుక్ తో గెటప్ మార్చేశాడు. దీంతో ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. దీనిపై స్పందించిన ఆయన తమిళంలో ఓ భారీ సినిమాలో నటిస్తున్నా… కొత్త సినిమాల కోసం సరికొత్త మేకోవర్‌లోకి వచ్చానని చెబుతున్నాడు. మరి విలన్ గా అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదింకోవాలని చూస్తున్న ఈ యువ నటుడు..బహు భాషా నటుడిగా ఎదిగి ఇంకా కెరీర్ లో దూసుకుపోవాలని కోరుకుందాం..
[youtube_video videoid=kvRa1mtUROo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: