నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `జెర్సీ`. ఇందులో రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు నాని. ఒకటేమో యంగ్ రంజీ ప్లేయర్ రోల్ కాగా… మరొకటి ఆ క్యారెక్టర్‌కు తండ్రి పాత్ర. రెండో పాత్రలోనే… మధ్య వయస్కుడైన క్రికెటర్ అర్జున్ గానూ కనిపించనున్నాడట నాని. అంతేకాదు… ట్రాజిక్ ఎండింగ్‌తో ఈ సినిమా ఉంటుందని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాలో కథానుసారం ఓ ప్రత్యేక గీతానికి కూడా స్థానముందని… ఆ పాటలో అందాల తార అదా శర్మ దర్శనమివ్వనుందని సమాచారం. త్వరలోనే అదా ఎంట్రీపై క్లారిటీ రానుంది. కాగా… కన్నడ బ్లాక్‌బస్టర్ `యూటర్న్`లో హీరోయిన్‌గా నటించిన శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో కథానాయికగా నటించగా… `మళ్ళీ రావా` ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కోలీవుడ్ యువ సంగీత సంచలనం అనిరుధ్ భాణీలు అందిస్తున్నాడు. వేసవి కానుకగా ఏప్రిల్ 19న `జెర్సీ` ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=qih-MjaRwnw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: