బ‌ల్గేరియాలో మొదలైన షెడ్యూల్..!

2019 Latest Telugu Film News, Charan And Tarak Ready For RRR New Schedule In Bulgaria, NTR to travel to Bulgaria For RRR Shooting, RRR Movie Latest News, RRR Movie New Schedule Update, RRR Movie Shooting Details, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, RRR New Schedule Begins in Balgeria
RRR New Schedule Begins in Balgeria

రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, చరణ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. తాజాగా ఈ సినిమా మరో షెడ్యూల్ ను ‘బల్గేరియా’లో ప్లాన్ చేశారు. దీనిలో భాగంగానే ఈ రోజునే అక్కడ షూటింగ్ మొదలుపెట్టింది చిత్ర యూనిట్. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారట. ఈ సన్నివేశాలు ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని అంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్ లో నటిస్తున్నాడు. చెర్రీ సరసన ఆలియా భట్ నటిస్తుండగా.. అజయ్ దేవగణ్, సముద్ర ఖని వంటి ప్రముఖ నటులు ఇతర కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ కు హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య రూపొందిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వ‌చ్చే ఏడాది జూలై 30న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయనున్నారు. మరి ఒక వైపున ఎన్టీఆర్ అభిమానులు .. మరో వైపున చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చుద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − eleven =